Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింబుల్డన్: తొలిరోజు ఊహించిన ఫలితాలే నమోదయ్యాయి

హైదరాబాద్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ సోమవారం ఆరంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు ఎటువంటి సంచలనాలు లేకుండా ఊహించిన ఫలితాలేనమోదయ్యాయి. స్టార్ ప్లేయర్లంతా శుభారంభం చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆండీ ముర్రే , స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.

సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ ముర్రే 6-1, 6-4, 6-2తో అలెగ్జాండర్‌ బుబ్‌లిక్‌ (కజకిస్తాన్‌)పై గెలిచాడు. రెండో రోజుల క్రితమే రెండో బిడ్డకు తండ్రయిన ముర్రే సొంతగడ్డపై తొలిరోజు అద్భుత ప్రదర్శన చేశాడు. గంటా 43 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌కు వర్షం కారణంగా రెండుసార్లు అంతరాయం కలిగింది.

రెండో రౌండ్‌లోకి ముర్రే

రెండో రౌండ్‌లోకి ముర్రే

మూడు ఏస్‌లు సంధించిన ముర్రే, నెట్‌ వద్ద 29 పాయింట్లు సాధించాడు. తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు. తొలిరౌండ్‌ను అలవోకగా అధిగమించిన ముర్రేకు రెండోరౌండ్లో డస్టిన్ బ్రౌన్ రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురవనున్నాడు. ఇక రెండో రౌండ్‌లో ప్రపంచ 97వ ర్యాంకర్‌ డస్టిన్‌ బ్రౌన్‌ (జర్మనీ)తో ముర్రే తలపడనున్నాడు.

850వ విజయాన్ని నమోదు చేసిన నాదల్

850వ విజయాన్ని నమోదు చేసిన నాదల్

రికార్డు స్థాయిలో పదో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి ఊపుమీదున్న నాదల్‌ తొలి రౌండ్‌లో 6-1, 6-3, 6-2 స్కోరుతో వరుస సెట్లలో ఆస్ట్రేలియాకు చెందిన అన్‌సీడెడ్‌ మిల్‌మాన్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. తద్వారా తన కెరీర్ లో 850వ విజయం నమోదు చేశాడు. ఫెడరర్‌, జిమ్మీ కానర్స్‌ తదితరుల తర్వాత ఈ ఫీట్‌ సాధించిన ఏడో ఆటగాడయ్యాడు. అంతేకాదు గ్రాండ్‌స్లామ్‌లో 217 విజయాలతో మేజర్‌ టోర్నీల్లో అత్యధిక విజయాలు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఆరో ప్లేయర్‌గా చోటు దక్కించుకున్నాడు. ఇక జపాన్‌కు చెందిన 9వ సీడ్ కీ నిషికొరి 6-2, 6-2, 6-0తో మార్కో కెచినాటో (ఇటలీ)పై 72 నిమిషాల్లోనే గెలుపొంది రెండోరౌండ్ చేరగా, ఫ్రాన్స్ స్టార్ సోంగా 6-3, 6-2, 6-2తో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ, స్థానిక ఆటగాడు కామెరూన్ నోరిని ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.

రెండోరౌండ్‌కు దూసుకెళ్లిన క్విటోవా

రెండోరౌండ్‌కు దూసుకెళ్లిన క్విటోవా

ఇక మహిళల సింగిల్స్ విషయానికి వస్తే రెండుసార్లు విజేత క్విటోవా, రెండో ర్యాంకర్ హాలెప్, వీనస్ విలియమ్స్ రెండోరౌండ్‌కు దూసుకెళ్లారు. రుమేనియాకు చెందిన హలెప్‌ 6-4, 6-1 స్కోరుతో న్యూజిలాండ్‌కు చెందిన మరీనా ఎరకోవిక్‌పై సునాయాసంగా గెలుపొందింది. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన ప్లిస్కోవా 7-6 (8), 6-2 స్కోరుతో రొబెర్టా విన్సీ (ఇటలీ)పై విజయంతో బోణీ చేసింది. ఇక ఎనిమిదో సీడ్‌ సిబుల్కోవా (స్లోవేకియా) 6-3, 3-6, 9-7 స్కోరుతో ఆండ్రియా పెట్కోవిక్‌ (జర్మనీ)పై అతి కష్టం మీద విజయం సాధించింది.

అతి కష్టం మీద గెలిచిన వీనస్

అతి కష్టం మీద గెలిచిన వీనస్

రష్యా క్రీడాకారిణి స్విటోలినా కూడా 7-5, 7-6 (10) స్కోరుతో బార్తి (ఆస్ట్రేలియా)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌, పదో సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) 7-6 (9-7), 6-4తో ఎలిసే మెర్టెన్స్‌ (బెల్జియం)పై విజయం సాధించింది. నాలుగో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), 11వ సీడ్‌ క్విటోవా (చెక్‌) కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నారు. హోరాహోరీగా సాగిన తొలి రౌండ్లో స్వితోలినా 7-5, 7-6 (10-8)తో అష్లే బార్తి (ఆస్ట్రేలియా)పై నెగ్గగా.. క్విటోవా 6-3, 6-4తో జొహానా లార్సన్‌ (స్వీడన్‌)ను ఓడించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+