Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వావ్రింకాకు వింబుల్డన్‌ షాక్: తొలి రౌండ్‌లోనే ఓటమి

హైదరాబాద్: ఈ ఏడాది అన్నా వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ గెలుద్దామన్నా అతడి ఆశ నెరవేరలేదు. సోమవారం ప్రారంభమైన వింబుల్డన్ టోర్నీలో ప్రపంచ మాజీ నెంబర్‌ వన్‌ ఆటగాడు, ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ స్టాన్‌ వావ్రింకా(స్విట్జర్లాండ్‌) తొలి రౌండ్‌లో ఓటమి పాలయ్యాడు.

వింబుల్డన్ టోర్నీలో అయిదో సీడ్‌గా బ‌రిలోకి దిగిన వావ్రింకా అనూహ్య రీతిలో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. రష్యాకు చెందిన డానిల్‌ మెడ్విడేవ్‌ 6-4, 3-6, 6-4, 6-1తేడాతో వావ్రింకాపై విజయం సాధించాడు. 21 ఏళ్ల డానిల్‌కి గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీల్లో ఇదే తొలి విజయం కావడం విశేషం.

తన కెరీర్‌లో వింబుల్డ‌న్‌లో తొలిసారి ఆడుతున్న డానిల్ మెద్వ‌దేవ్ రెండ‌ో రౌండ్‌లో బెల్జియం ప్లేయ‌ర్ రూబెన్ బెమిల్‌మాన్స్‌తో త‌ల‌ప‌డ‌నున్నాడు. ప్రతిష్టాత్మక వింబుల్డ‌న్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే వావ్రింకా నిష్క్రమించడం ఇది ఆరోసారి. ఇటీవ‌ల జ‌రిగిన క్వీన్స్ క్ల‌బ్ టోర్నీలోనూ వావ్రింకా తొలి రౌండ్‌లోనే నిష్క్ర‌మించాడు.

Wimbledon: 3-time major champ Stan Wawrinka suffers shock defeat due to bad knee

అయితే గత కొంతకాలంగా వావ్రింకా ఎడమ కాలు గాయంతో బాధపడుతున్నాడు. ఓటమి అనంతరం వావ్రింకా మాట్లాడుతూ గ్రాస్ కోర్టుకి తన మోకాలు ఉత్తమమైన ఉపరితలం కాదని పేర్కొన్నాడు. దీని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని వావ్రింకా తెలిపాడు. ఎటువంటి బాధ లేకుండా గ్రాస్ కోర్టులో ఆడటంపై దృష్టి సారిస్తానని చెప్పాడు.

ఇదిలా ఉంటే వావ్రింకాపై గెలుపొందిన అనంతరం డానిల్ మాట్లాడుతూ 'ఏడాది క్రితం నా ర్యాంకు 250. ఈ సమయంలో పలువురు ఏడాదిలోగా సెంటర్‌ కోర్టులో విజయం సాధిస్తావు అని అనేవారు. నేను ఆ మాటలను చాలా జోక్‌గా తీసుకున్నాను. కానీ అదే నిజమైంది' అని అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+