Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2024:: బోపన్న బోణీ.. నగాల్‌కు షాక్

వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఆసక్తికరంగా సాగుతోంది. నార్వే స్టార్ ప్లేయర్ కాస్పర్ రూడ్ బిగ్ షాక్ తగిలింది. అతను రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. టైటిల్ ఫేవరేట్ స్పెయిర్ స్టార్ ఆటగాడు కార్లోస్ అల్కరాస్‌ సునాయాసంగా మూడో రౌండ్‌లోకి వెళ్లాడు. మరోవైపు భారత్‌ ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న-ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ రెండో రౌండ్ చేరింది. సుమిత్‌ నగాల్‌-డుసాన్‌ లజోవిక్‌ (సెర్బియా) ద్వయానికి తొలిరౌండ్‌లోనే చుక్కుదురైంది.

బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో 8వ సీడ్ రూడ్‌కు ఊహించని పరాభవం. ఇటలీకి చెందిన అన్‌ సీడెడ్‌ ఫాగియో ఫోగ్నితో జరిగిన పోరులో 4-6, 5-7, 7-6 (7), 3-6తో ఓటమిపాలయ్యాడు. 3 గంటల 18 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో ప్రత్యర్థి ముందు రూడ్ తలవంచాడు. మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్ అల్కారజ్‌ 7-6 (5), 6-2, 6-2తో ఉకిక్‌పై ఘన విజయం సాధించి మూడోరౌండ్‌లోకి ప్రవేశించాడు.

Wimbledon 2024 Rohan Bopanna and Matthew Ebden Advance to Second Round

అలాగే అయిదో సీడ్ డానిల్ మెద్వెదెవ్ కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ముల్లెర్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-7 (7), 7-6 (4), 6-4, 7-5తో మెద్వెదెవ్‌ గెలిచాడు. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో కొకొ గాఫ్ రెండో రౌండ్‌లో ఘన విజయంతో మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. ప్రత్యర్థి టొడోనిని 6-2, 6-1తో చిత్తుచేసింది.

మరోవైపు కొలిన్స్‌ (అమెరికా), క్రెజికోవా (చెక్‌), స్వితోలినా (ఉక్రెయిన్‌), నీమియర్‌ (జర్మనీ), వొలినెట్స్‌ (అమెరికా), ఒసోరియో (కొలంబియా), హదద్‌ మలా (బ్రెజిల్‌), ఆంద్రీస్కూ (కెనడా) రెండో రౌండ్‌కు చేరుకున్నారు. కాగా, రోహన్‌ బోపన్న-ఎబ్డెన్‌ జోడీ రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. నెదర్లాండ్స్‌ జోడీ రాబిన్‌ హాస్‌-సాండెర్‌ అరెన్స్‌పై 7-5, 6-4తో బోపన్న జంట నెగ్గింది. ఇక, తొలి రౌండ్‌లో సుమిత్‌ నగాల్‌-డుసాన్‌ లజోవిక్‌ జంట 2-6, 2-6తో స్పెయిన్‌ జోడీ మునార్‌-మార్టినేజ్‌ చేతిలో ఓటమిపాలైంది.

Story first published: Thursday, July 4, 2024, 11:56 [IST]
Other articles published on Jul 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+