Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2024: మూడో రౌండ్‌లో జకోవిచ్

వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో బ్రిటన్ ఆటగాడు జాకబ్ ఫెర్న్‌లీపై జకోవిచ్ ఘన విజయం సాధించాడు. రెండో సీడ్ జకోవిచ్ ప్రత్యర్థిపై 6-3, 6-4, 5-7, 7-5తో నెగ్గాడు.

మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, ఇటలీ ప్లేయర్ జానిక్ సిన్నర్ గెలిచాడు. తన దేశ క్రీడాకారుడు బెరెటినిపై 7-6 (7-3), 7-6 (7-4), 2-6, 7-6 (7-4)తో విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరు 3 గంటల 42 నిమిషాల పాటు సాగింది. అలాగే గ్రిగోర్ దిమిత్రోవ్‌ (బల్గేరియా) కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. చైనా ప్లేయర్ చెంగ్‌ను 5-7, 6-7 (7), 6-4, 6-2, 6-4తో చిత్తుచేశాడు.

Wimbledon 2024 Novak Djokovic Overcomes Jacob Fearnley Challenge to Advance to Round 3

మరోవైపు ఏడో సీడ్‌ హుర్కాజ్‌ (పోలెండ్) వాకోవర్‌ ఇచ్చాడు. ఫిల్స్ (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్‌లో 6-7 (2-7), 4-6, 6-2, 6-6 (8-9)తో వెనుకబడిన దశలో గాయం కారణంగా తప్పుకున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో మరోవైపు టైటిల్‌ ఫేవరెట్‌ స్వైటెక్‌ (పోలెండ్‌) మూడో రౌండ్‌‌కు సునాయాసంగా చేరింది. మార్టిచ్‌ (క్రొయేషియా)పై 6-4, 6-3తో గెలిచింది.

జపాన్ స్టార్ నవోమి ఒసాకా రెండో రౌండ్‌లోనే నిష్క్రమించింది. 19వ సీడ్ ఎమ్మా నవారోతో జరిగిన మ్యాచ్‌లో 4-6, 1-6 తేడాతో ఘోరపరాభవాన్ని ఎదుర్కొంది. మహిళల సింగిల్స్‌లో వాంగ్‌ (చైనా), జాబెర్‌ (ట్యునీసియా), రిబకినా (కజకిస్థాన్‌), బౌజాస్‌ (స్పెయిన్‌), డార్ట్‌ (బ్రిటన్‌) కూడా రెండో రౌండ్‌ దాటారు. పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్‌ బాలాజీ-జాన్సన్‌ (బ్రిటన్‌) జోడీ 4-6, 5-7తో నాలుగో సీడ్‌ మార్సెలో (సాల్వడార్‌), పవిక్‌ (క్రొయేషియా) ద్వయం చేతిలో మొదటి రౌండ్‌లో ఓటమి చవిచూసింది.

Story first published: Friday, July 5, 2024, 10:22 [IST]
Other articles published on Jul 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+