Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2024: ఫైనల్‌లో జకోవిచ్ X అల్కారజ్

వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ‌ పురుషుల సింగిల్స్‌లో నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కారజ్ టైటిల్ పోరుకు అర్హత సాధించారు. సెర్బియా స్టార్ జకోవిచ్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ అల్కారజ్‌ వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ తుదిపోరులో పోటీపడుతున్నారు. గతేడాది జరిగిన ఫైనల్‌లో జకోవిచ్‌పై పైచేయి సాధించి అల్కారజ్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి టైటిల్ పోరులో వారిద్దరే తలపడుతున్నారు.

సెమీఫైనల్‌లో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై జకోవిచ్ 6-4, 7-6 (7/2), 6-4 ఘన విజయం సాధించాడు. ప్రత్యర్థి ఆధిపత్యం చెలాయిస్తూ వరుసగా మూడు సెట్లలో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 24 గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన జకోవిచ్ గత ఫైనల్ ప్రతీకారాన్ని తీర్చుకుని 25వ టైటిల్ సాధించాలని కసితో ఉన్నాడు.

Wimbledon 2024 Novak Djokovic Defeats Lorenzo Musetti to Reach Wimbledon Final Against Carlos Alcaraz

మరోవైపు రష్యా ఆటగాడు మెద్వెదెవ్‌పై అల్కారజ్‌ 6-7 (1/7), 6-3, 6-4, 6-4తో విజయం సాధించాడు. తొలి సెట్‌‌ను టైబ్రేక్‌లో కోల్పోయిన స్పెయిన్ కుర్రాడు అల్కారజ్ ఆ తర్వాత చెలరేగాడు. రెండు గంటలా 55 నిమిషాల పాటు సాగిన సెమీస్‌ పోరులో అల్కారజ్ సత్తాచాటాడు. కాగా, అదే జోరులో ఆదివారం జరిగే ఫైనల్‌లోనూ గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్నాడు.

ఈ ఏడాది కూడా అల్కారజ్ ఛాంపియన్‌గా నిలిస్తే...ఒకటి కంటే ఎక్కువసార్లు వింబుల్డన్‌ అందుకున్న 22 ఏళ్లలోపు వయసు ఆటగాడిగా దిగ్గజాలు బోరిస్‌ బెకర్‌, జాన్‌ బోర్గ్‌ల సరసన నిలుస్తాడు.

కాగా, ఇవాళ మహిళల సింగిల్స్ ఫైనల్ పోరు జరగనుంది. టైటిల్ పోరులో పావోలిని (ఇటలీ)తో క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) పోటీపడనుంది. వీరిద్దరిలో ఎవరు గెలిచినా వింబుల్డన్‌లో కొత్త ఛాంపియన్‌గా నిలుస్తారు. వింబుల్డన్‌ ఫైనల్‌ చేరడం ఇద్దరికీ ఇదే తొలిసారి. అయితే ఈ టోర్నీలో గతంలో పావోలిని ఎప్పుడూ తొలి రౌండ్‌ దాటలేదు. కానీ సంచలన ప్రదర్శను చేస్తూ తుదిపోరుకు అర్హత సాధించింది. మరోవైపు క్రెజికోవాకు నాలుగో రౌండ్‌ చేరడమే అత్యుత్తమ ప్రదర్శన.

Story first published: Saturday, July 13, 2024, 11:53 [IST]
Other articles published on Jul 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+