వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఆనవాయితీ కొనసాగుతోంది. 2016 నుంచి ప్రతి ఏడాది కొత్త ఛాంపియన్ అవతరిస్తున్నట్లుగానే ఈసారి కొత్తరాణి వచ్చేసింది. మహిళల సింగిల్స్‌లో చెక్ రిపబ్లిక్ అమ్మాయి క్రెజికోవా ఛాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌లో ఇటలీ స్టార్ జాస్మైన్ పావోలినిపై 6-2, 2-6, 6-4 తేడాతో విజయం సాధించింది.
టైటిల్ పోరు గంట 56 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. తొలి సెట్‌లో క్రెజికోవా పైచేయి సాధించింది. కానీ రెండో సెట్‌లో పావోలిని గొప్పగా పుంజుకుంది. నిర్ణయాత్మక పోరు రసవత్తరంగా సాగింది. ఓ దశలో 3-3తో ఇద్దరూ సమంగా నిలిచారు. కానీ అంతిమంగా క్రెజికోవా పైయేయి సాధించి టైటిల్ గెలిచింది. క్రెజికోవా ఆరు ఏస్‌లు, పావోలిని మూడు ఏస్‌లు కొట్టింది. కాగా, ఇద్దరికీ ఇదే తొలి వింబుల్డన్ ఫైనల్ అనే విషయం తెలిసిందే.

కాగా, పురుషుల సింగిల్స్‌లో రేపు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్కారజ్ టైటిల్ పోరులో తలపడుతున్నారు. సెర్బియా స్టార్ జకోవిచ్, డిఫెండింగ్ చాంపియన్ అల్కారజ్ వరుసగా రెండో ఏడాది వింబుల్డన్ తుదిపోరులో పోటీపడుతున్నారు. గతేడాది జరిగిన ఫైనల్‌లో జకోవిచ్‌పై పైచేయి సాధించి అల్కారజ్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి టైటిల్ పోరులో వారిద్దరే తలపడుతున్నారు.