For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ నెంబర్ వన్‌కు షాక్.. అన్‌సీడెడ్ చేతిలో ఓటమి.. వింబుల్డన్‌ నుంచి స్వియటెక్‌ అవుట్!

వింబుల్డన్‌లో భారీ అప్‌సెట్ కనబడింది. ప్రపంచ మహిళల నెంబర్ వన్, టాప్ సీడ్ ఇగా స్వియటెక్ ఇంటి దారి పట్టింది. టైటిల్‌ ఫేవరెట్‌ టోర్నీ ఆరంభించిన స్వియటెక్‌‌కు క్వార్టర్ ఫైనల్‌లో షాక్ తగిలింది. ఉక్రెయిన్‌ స్టార్‌, అన్‌సీడెడ్‌ ఎలినా స్విటొలినా.. ప్రపంచ నెంబర్‌వన్‌ స్వియటెక్‌ను మట్టికరిపించి సెమీఫైనల్ చేరుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఎవరూ తమ కళ్లను తామే నమ్మలేకపోయారు

ఇక నాలుగో సీడ్‌ జెస్సికా పెగుల కూడా ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించడం గమనార్హం. ఇటలీ ఆటగాడు జానిక్‌ సిన్నర్‌ సెమీస్ చేరుకున్నాడు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో పోలెండ్‌కు చెందిన వరల్డ్‌ నెం.1 స్వియటెక్‌ తొలి సెట్‌లోనే ఓటమి పాలైంది. స్విటొలినా ఈ సెట్‌ను 5-7తో తన ఖాతాలో వేసుకుంది. అయితే రెండో సెట్‌లో స్వియటెక్ పుంజుకుంది. ఈ సెట్‌ను 7-6(5)తో స్వియటెక్ గెలిచింది.

Wimbledon 2023 World Number One Iga Swiatek out of the tournament

ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో స్విటొలినా చెలరేగింది. స్వియటెక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వని ఆమె 2-6తో ఈ సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకుంది. ఇలా వింబుల్డన్ సెమీస్ చేరడం స్విటొలినాకు ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు 2019లో సెమీస్‌ చేరిన ఆమె.. హలెప్‌ చేతిలో ఓడింది. గత అక్టోబరులో తల్లయిన స్విటోలినా.. ఏప్రిల్‌లో మళ్లీ బరిలోకి దిగింది.

తన రీ-ఎంట్రీలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌కు చేరుకొన్న స్విటొలినా.. వైల్డ్‌కార్డ్‌ ద్వారా వింబుల్డన్‌లో ప్రవేశించింది. ఇక్కడ ఏకంగా ప్రపంచ నెంబర్ వన్‌కు షాకిచ్చింది. ఇక మరో మ్యాచ్‌లో అమెరికాకు చెందిన నాలుగోసీడ్‌ జెస్సికా పెగుల కూడా ఓటమిపాలైంది. చెక్‌కు చెందిన మార్కెటా వాండర్సొవా చేతిలో 4-6, 6-2, 4-6తో ఓటమిపాలై ఇంటి దారి పట్టింది. తొలిసారి సెమీస్‌ చేరిన వాండర్సొవా.. ఫైనల్లో బెర్తు కోసం స్విటొలినాతో తలపడుతుంది.

ఇక పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో 8వ సీడ్‌ జానిక్‌ సిన్నర్‌ (ఇటలీ) 6-4, 3-6, 6-2, 6-2తో రోమన్‌ సఫియుల్లీన్‌పై విజయం సాధించాడు. ఇక ప్రీక్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ కార్లోస్‌ అల్కారెజ్ 3-6, 6-3, 6-3, 6-3తో ఇటలీ ఆటగాడు మాటియో బెరెట్టినీపై గెలవగా.. డెన్మార్క్‌‌కు చెందిన ఆరో సీడ్‌ హోల్గర్‌ రూన్‌ 3-6, 7-6(6), 7-6(4), 6-3తో బల్గేరియన్ ఆటగాడు గ్రిగోర్‌ దిమిత్రోవ్‌రె ఒడించాడు.

ఇక భారత్ విషయానికొస్తే బోపన్న జోడీ ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంది. రౌండ్‌-16లో బోపన్న-మాథ్యూ ఎబ్‌డెన్‌ జోడీ అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. డేవిడ్ పెల్, రీస్ స్టాల్డర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 7-5, 4-6, 7-6(5)తో బోపన్న జోడీ నెగ్గింది. 2015 తర్వాత క్వార్టర్స్ చేరడం బోపన్నకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. అదే సమయంలో ఇన్విటేషన్‌ డబుల్స్‌ రౌండ్‌ రాబిన్‌లో సానియా మీర్జా- జొహన్నా కొంటా (బ్రిటన్‌) జంట కూడా ఆకట్టుకుంది. ఆండ్రియా పెట్కోవిక్, రిబరికొవా జోడీపై 6-3, 7-6(6)తో విజయం సాధించింది.

Story first published: Wednesday, July 12, 2023, 10:25 [IST]
Other articles published on Jul 12, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+