For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wimbledon 2023: 200 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి.. కూల్‌గా కుర్చీలో కూర్చొని పట్టేశాడు! (వీడియో)

వింబుల్డన్‌ టోర్నమెంట్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రపంచ నెంబర్ వన్ కార్లోస్ అల్కారెజ్ ఆడుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ టోర్నీ తొలి రెండు రౌండ్లలో నెగ్గిన అల్కారెజ్.. మూడో రౌండ్‌లో నికోలస్ జారీతో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో నికోలస్ సర్వ్‌ను కార్లోస్ రిటర్న్ చేశాడు. ఈ సమయంలో కార్లోస్ రిటర్న్ ఏకంగా 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.

అయితే అది ప్రత్యర్థి వైపు కాకుండా.. చైర్ అంపైర్ వైపు బంతి వేగంగా వెళ్లింది. మరెవరైనా అయితే ఆ బంతి తగిలి కిందపడతారేమో? కానీ ఆ అంపైర్ మాత్రం చాలా క్విక్‌గా రియాక్ట్ అయ్యాడు. చటుక్కున ఆ బంతిని చేత్తో పట్టేశాడు. ఇలా 200 కిలోమీటర్ల వేగంతో వస్తున్న బంతిని అతను క్యాచ్ పట్టేయడం చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. పెద్దగా చప్పట్లు కొడుతూ అతన్ని అభినందించారు.

Chair umpire calmly catches a near 200 kmph ball

ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన చాలా మంది ఫ్యాన్స్ షాకవుతున్నారు. 'అతను క్యాచ్ పట్టడం కాదు. చాలా కూల్‌గా ఉన్నాడు. ఏమాత్రం తడబడలేదు. అది కదా క్లాస్ అంటే' అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో నెంబర్ వన్ కార్లోస్ అల్కారెజ్ అద్భుతమైన విజయం నమోదు చేశాడు.

ఈ మ్యాచ్ తొలి సెట్‌ను 6-3తో కార్లోస్ తన ఖాతాలో వేసుకోగా.. రెండో సెట్‌లో నికోలస్ పుంజుకున్నాడు. ఈ సెట్‌ను తను గెలుచుకున్నాడు. అయితే ఆ తర్వాత తన వేగం పెంచిన కార్లోస్.. వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కార్లోస్ 6-3, 6-7 (8), 6-3, 7-5 తేడాతో నికోలస్‌ను ఓడించాడు.

Story first published: Monday, July 10, 2023, 13:19 [IST]
Other articles published on Jul 10, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+