Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింబుల్డన్‌ సీడింగ్‌.. రఫెల్‌ నాదల్‌ అసంతృప్తి

Wimbledon 2019: Seeding formula doesnt seem right says Rafael Nadal

ప్రపంచ ర్యాంకింగ్స్‌లను కాదని సొంత విధానంలో వింబుల్డన్‌ సీడింగ్‌లను నిర్ణయించడంపై టెన్నిస్‌ స్టార్, స్పెయిన్ బుల్ రఫెల్‌ నాదల్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వచ్చే వారం ఆరంభంకానున్న వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ తర్వాతి సీడ్‌ తనకు కేటాయించడంపై నాదల్‌ అసంతృప్తిగా ఉన్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వింబుల్డన్‌ మినహా మిగతా మూడు గ్రాండ్‌స్లామ్‌ల్లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లను బట్టే ఆటగాళ్లకు సీడింగ్‌ కేటాయిస్తారు. కానీ ఒక్క వింబుల్డన్‌లోనే ర్యాంకింగ్స్‌ కాకుండా గ్రాస్ కోర్టులపై ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా సీడింగ్‌లు ఇస్తోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఫెదరర్‌ ఉండగా.. రెండో స్థానంలో నాదల్‌ ఉన్నాడు. అయితే మరో వారంలో ప్రారంభం కానున్న వింబుల్డన్‌లో మాత్రం ఫెదరర్‌కు రెండో సీడ్‌, నాదల్‌కు మూడో సీడ్‌ లభించింది. దీంతో వింబుల్డన్‌ సీడింగ్‌ సరికాదు అని నాదల్‌ అంటున్నాడు.

'కేవలం వింబుల్డన్‌లో మాత్రమే సీడింగ్ ఇలా ఇస్తున్నారు. మూడు కంటే రెండు మెరుగైందే కదా. ఒకవేళ నేను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉంటే.. వింబుల్డన్‌ మూడో సీడింగ్‌ను ఒప్పుకునే వాడిని. ఇది నా ఒక్కడి విషయంలోనే కాదు.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న మిగతా ఆటగాళ్లకు ఇలాగే జరుగుతోంది. దీంతో కఠినమైన డ్రా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధానం ర్యాంకింగ్‌లను అవమానించడమే. మిగతా గ్రాండ్‌స్లామ్‌లు అనుసరించిన విధానాలనే వింబుల్డన్‌లోనూ తీసుకుంటే బాగుంటుంది' అని రఫా అభిప్రాయపడ్డాడు.

Story first published: Wednesday, June 26, 2019, 8:53 [IST]
Other articles published on Jun 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+