Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింబుల్డన్‌ సెమీస్‌లో ఫెదరర్‌ vs నాదల్‌

Wimbledon 2019: Roger Federer beats Kei Nishikori to set up Rafael Nadal Wimbledon semi-final, Novak Djokovic also enters semis

టైటిల్‌ ఫేవరెట్‌, రెండో సీడ్ రోజర్‌ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌) వింబుల్డన్ గ్లాండ్‌స్లామ్ టోర్నీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ఫెదరర్‌ 4-6, 6-1, 6-4, 6-4తో నిషికోరి (జపాన్‌)పై చెమటోడ్చి నెగ్గాడు. రెండున్నర గంటల పాటు సాగిన మ్యాచ్‌లో 12 ఏస్‌లు కొట్టిన ఫెదరర్.. 55 విన్నర్లను సాధించాడు. వింబుల్డన్‌లోఫెదరర్‌కు ఇది వందో విజయం కావడం విశేషం. అలాగే ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీ చరిత్రలో సెంచరీ విజయాలు సాధించిన ఏకైక ఆటగాడిగానూ ఫెదరర్‌ చరిత్ర లిఖించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మరో మ్యాచ్‌లో రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) 7-5, 6-2, 6-2తో క్వెరె (అమెరికా)ను వరుస సెట్లలో ఓడించాడు. 2 గంటల ఏడు నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌ను సునాయాసంగా గెలిచి సెమీస్‌లోకి వచ్చాడు. సెమీస్‌లో రోజర్‌ ఫెదరర్‌తో రఫెల్‌ నాదల్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇక టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) కూడా సెమీస్‌ చేరాడు. 6-4, 6-0, 6-2తో గోఫిన్‌ (బెల్జియం)ను ఓడించాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీ సెమీస్‌కు చేరుకోవడం జకోవిచ్‌కు ఎనిమిదోసారి.

మరో క్వార్టర్స్‌లో గిడో పెల్లా (అర్జెంటీనా)పై 7-5, 6-4, 3-6, 6-3 తేడాతో బాటిస్టా అగట్ (స్పెయిన్) గెలుపొందాడు. సెమీస్‌లో జకోవిచ్‌, అగట్‌ తలపడనున్నారు. పురుషుల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌లు శుక్రవారం జరుగుతాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తొలిసారి జత కట్టిన స్టార్‌ జోడీ సెరెనా విలియమ్స్‌-ఆండీ ముర్రే మూడో రౌండ్లో 3-6, 6-4, 2-6తో సోరెస్‌-మెలికార్‌ చేతిలో ఓడారు. గురువారం జరిగే మహిళల సెమీస్‌లో సెరీనాతో స్ట్రికోవా, స్విటోలినాతో హలెప్ తలపడతారు.

Story first published: Thursday, July 11, 2019, 9:06 [IST]
Other articles published on Jul 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+