Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అండర్సన్‌కు షాక్ .. ప్రిక్వార్టర్స్‌లో హలెప్, జొకోవిచ్

Wimbledon 2019: Kevin Anderson crashes out, Novak Djokovic and Simona Halep advance

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో మరో స్టార్‌ ఆటగాడు ఇంటిబాట పట్టాడు. పురుషుల సింగిల్స్‌లో గతేడాది రన్నరప్, నాలుగో సీడ్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)కు మూడో రౌండ్లోనే షాక్ తగిలింది. ఇక పదోసీడ్‌ ఖచనోవ్‌ (రష్యా) కూడా ఓడిపోయాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా), రావ్‌నిచ్‌ (కెనడా) ప్రిక్వార్టర్స్‌ చేరాడు. మహిళల సింగిల్స్‌లో హలెప్‌, ప్లిస్కోవా ప్రిక్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆండర్సన్‌ మూడోరౌండ్లో అర్జెంటీనా క్రీడాకారుడు, 26వ సీడ్‌ గిడో పెల్లా 6-4, 6-3, 7-6(7/4)తో కెవిన్‌ ఆండర్సన్‌ను వరుస సెట్లలో చిత్తుచేసి తొలిసారి గ్రాండ్‌స్లామ్‌లో ప్రీక్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌ బెర్త్‌కోసం 2016 రన్నరప్‌ మిలోస్‌ రవోనిక్‌ (కెనడా)తో పెల్లా తలపడనున్నాడు. టాప్‌సీడ్‌ జొకోవిచ్‌ 7-5, 6-7 (5/7), 6-1, 6-4తో హుర్కాజ్‌ (పోలెండ్‌)పై గెలిచి ప్రీక్వార్టర్స్‌ చేరాడు. 15వ సీడ్‌ రవోనిక్‌ 7-6(7/1), 6-2, 6-1తో రిలీ ఒపెల్కా(అమెరికా)ను ఓడించాడు. రోబర్టా బటిస్టా అగట్‌ (స్పెయిన్‌) 6-3, 7-6(3), 6-1తో ఖచనోవ్‌ (రష్యా)ను బోల్తా కొట్టించాడు.

మహిళల సింగిల్స్‌లో మాజీ నెంబర్‌వన్‌, గతేడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత కరోలిన్‌ వోజ్నియాకి (డెన్మార్క్‌)కి చుక్కెదురైంది. మూడో రౌండ్లో చైనాకు చెందిన 60వ ర్యాంకర్‌ జాంగ్‌ షుయ్‌ 6-4, 6-2తో వోజ్నియాకికి షాకిచ్చింది. మూడోసీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-3, 2-6, 6-4తో సీ సూవీ (తైవాన్‌)పై.. 7వ సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) 6-3, 6-1తో అజరెంకా (బెలార్‌స)పై.. 8వ సీడ్‌ స్విటోలినా 6-3, 6-7(1), 6-2తో మరియా సక్కారి (జర్మనీ)పై.. పెట్రా మార్టిక్‌ 6-4, 3-6, 6-4తో రోజ్‌ కొలిన్స్‌పై గెలిచి ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.

వింబుల్డన్‌ పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు దివిజ్‌ శరణ్‌ ప్రీక్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ రెండోరౌండ్లో దివిజ్‌-మార్సెలో డెమోలైనర్‌ (బ్రెజిల్‌) జోడీ 7-6(1), 5-7, 7-6 (6), 6-4తో బెల్జియం జంట సాండర్‌ గిల్లె-జోరాన్‌ లీగెన్‌పై గెలిచింది. ఇప్పటికే లియాండర్‌ పేస్‌, బోపన్న, పురవ్‌ రాజా, జీవన్‌ నిష్క్రమించడంతో టోర్నీలో పురుషుల డబుల్స్‌లో భారత్‌ నుంచి దివిజ్‌ మాత్రమే బరిలో నిలిచాడు.

Story first published: Saturday, July 6, 2019, 8:18 [IST]
Other articles published on Jul 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+