Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెరెనానే స్ఫూర్తి.. వింబుల్డన్ నా లక్ష్యం

Wimbledon 2019: Inspired by Serena Williams, Wimbledon is my goal says 15-Year-Old America Player Cori Gauff

టెన్నిస్ ఆడడానికి అమెరికా స్టార్ సెరీనా విలియమ్స్ నాకు స్ఫూర్తి. వింబుల్డన్ టైటిల్ సాధించడమే నా లక్ష్యం అని అమెరికా క్రీడాకారిణి, 15 ఏండ్ల అమ్మా యి కోరీ గాఫ్ అంటోంది. వింబుల్డన్ క్వాలిఫయర్స్ ఫైనల్ రౌండ్‌కు ముందు రోజు గాఫ్ పరీక్ష కోసం రాత్రి 11గంటల వరకు చదివింది. సాధన చేయకపోయినా.. బెల్జియం క్రీడాకారిణి మినెన్‌పై 6-1, 6-1 తేడాతో గెలుపొందింది. అయితే 313 ర్యాంకులో ఉన్న కారణంగా వింబుల్డన్‌కు నేరుగా అర్హత సాధించలేకపోయినా.. అనంతరం వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో మెయిన్‌డ్రాలో అవకాశం దక్కించుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రస్తుతం వింబుల్డన్‌-2019లో కోరీ గాఫ్ అదరగొడుతోన్న విషయం తెలిసిందే. వింబుల్డన్ మహిళల సింగిల్స్ మెయిన్‌డ్రాకు అర్హత సాధించిన పిన్న వయస్కురాలి (15ఏండ్ల 122రోజులు)గా రికార్డు సృష్టించింది. ఐదు సార్లు వింబుల్డన్ చాంపియన్, సీనియర్ ప్లేయర్ వీనస్ విలియమ్స్‌ను తొలి రౌండ్‌లోనే వరుస సెట్లలో సునాయాసంగా ఓడించి వార్తల్లోకి ఎక్కింది. అనంతరం రెండు, మూడు రౌండ్లలో సీనియర్ ప్లేయర్లపై విజయం సాధించి ప్రిక్వార్టర్‌కు దూసుకెళ్లింది. ఇక టైటిల్‌ గెలవడమే ఉంది.

టెన్నిస్ ఆడేందుకు ప్రధాన కారణం సెరెనా విలియమ్స్. సెరీనా వింబుల్డన్ ఆడి టైటిల్ గెలవడం చిన్నప్పుడు చూసి స్ఫూర్తి పొందా. ఇప్పటికీ కూడా ఆమె అద్భుతంగా ఆడుతోంది అని గాఫ్ పేర్కొంది. వింబుల్డన్ సాధించడమే నా లక్ష్యం. ఈ ఆటలో ఉత్తమ క్రీడాకారిణి అవ్వాలనేది నా కల. ఎవరినైనా ఓడించగలననే ఆత్మవిశ్వాసం ఉంది అని గాఫ్ తెలిపింది.

Story first published: Monday, July 8, 2019, 9:03 [IST]
Other articles published on Jul 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+