Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింబుల్డన్‌లో సంచలనం.. ఒసాకాకు షాక్‌

Wimbledon 2019: Cori Gauff beats Venus Williams, Novak Djokovic through, Naomi Osaka out

వింబుల్డన్‌లో తొలి రోజే సంచలనాలు నమోదయాయ్యి. మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌), పదో సీడ్‌ సబలెంకా (బెలారస్‌), 16వ సీడ్‌ వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌), ఐదుసార్లు చాంపియన్ అమెరికా దిగ్గజం వీనస్‌ విలియమ్స్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. అలాగే పురుషుల్లో ఏడోసీడ్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌, ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వరేవ్‌ సైతం మొదటిరౌండ్‌లోనే కంగుతిన్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మహిళల టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఒసాకాకు అనామక క్రీడాకారిణి షాక్ ఇచ్చింది. సోమవారం జరిగిన తొలిరౌండ్‌లో అన్‌సీడెడ్‌ యులియా పుటెంట్సేవా (రష్యా) 7-6 (4), 6-2తో ఒసాకాను చిత్తు చేసింది. దాంతో మూడోగ్రాండ్‌స్లామ్‌ సాధించాలన్న ఒసాకా కలలు ఆవిరయ్యాయి. వింబుల్డన్‌లో మెయిన్‌ 'డ్రా'కు అర్హత సాధించిన పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించిన అమెరికా టీనేజర్ కోరి గాఫ్‌ (15) గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ కెరీర్‌ను చిరస్మరణీయ విజయంతో మొదలుపెట్టింది. 39 ఏళ్ల వీనస్‌ విలియమ్స్‌తో జరిగిన తొలి రౌండ్‌లో కోరి గాఫ్‌ 6-4, 6-4తో గెలుపొందింది. రిబరికోవా (స్లొవేకియా) 6-2, 6-4తో సబలెంకాపై, బ్రింగిల్‌ (అమెరికా) 6-4, 6-4తో ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ వొండ్రుసోవాపై విజయాలు సాధించారు.

పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 6-4, 3-6, 2-6, 5-7తో జిరీ వెసిలీ (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో.. సిట్సిపాస్‌ 4-6, 6-3, 4-6, 7-6 (10/8), 3-6తో ఫాబియానో (ఇటలీ) చేతిలో ఓడిపోయారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ నోవాక్ జొకోవిచ్‌ (సెర్బియా) 6-3, 7-5, 6-3తో కోల్‌ష్రైబర్‌ (జర్మనీ)పై నెగ్గాడు. భారత ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ 6-7 (1/7), 4-6, 2-6తో 15వ సీడ్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా) చేతిలో ఓడిపోయాడు.

Story first published: Tuesday, July 2, 2019, 8:47 [IST]
Other articles published on Jul 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+