న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింబుల్డన్‌లో మరో సంచలనం.. ఏంజెలిక్‌ కెర్బర్‌ ఔట్‌.. ఫెదరర్‌, నాదల్‌ ముందంజ

Wimbledon 2019: Angelique Kerber out; Ashleigh Barty & Petra Kvitova through, Nadal beats Kyrgios

ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచనాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నయోమి ఒసాకా, వీనస్‌ విలియమ్స్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌, సిట్సిపాస్‌, స్టానిస్లాస్‌ వావ్రింకా లాంటి స్టార్లు టోర్నీ నుండి నిష్క్రమించగా.. గురువారం డిఫెండింగ్ చాంపియన్ అంజెలిక్ కెర్బర్ (జర్మనీ) రెండో రౌండ్‌లోనే లారెన్ డేవిస్ (95వ ర్యాంకు) చేతిలో పరాజయం పాలైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో కెర్బర్ 6-2, 2-6, 1-6తో పేలవ ప్రదర్శన చేసి లారెన్ డేవిస్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఒక్క ఏస్ కూడా సాధించలేక పోయిన కెర్బర్.. కేవలం 13 విన్నర్లు కొట్టింది. మరోవైపు ప్రత్యర్థి డేవిస్ 45విన్నర్లతో సత్తా చాటింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టాప్ సీడ్ ఆష్లే బార్టీ 6-1, 6-3 తేడాతో వాన్ యుత్వాంక్(బెల్జియం)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో యువ సంచనలం కోరీ గాఫ్ (313) 6-3, 6-3తేడాతో రైబోరికోవా (స్లోవేకియా,139) పై గెలుపొందింది. 1991 తర్వాత వింబుల్డన్ మూడోరౌండ్‌కు అర్హత సాధించిన తొలి 15 ఏండ్ల అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. సెరెనా 2-6, 6-2, 6-4తో జువాన్‌ (స్లొవేనియా)పై గెలిచింది. క్విటోవా 7-5, 6-2తో క్రిస్టినా మ్లెదెనోవిచ్‌ (ఫ్రాన్స్‌)పై, స్టీఫెన్స్‌ (అమెరికా) 6-0, 6-2తో యఫాన్‌ వాంగ్‌ (చైనా)పై నెగ్గారు.

జొహానా కొంటా (ఇంగ్లండ్‌) 6-3, 6-4తో క్యాథరినా సినికోవా (చెక్‌రిపబ్లిక్‌)పై, హారియెట్‌ డార్ట్‌ (ఇంగ్లండ్‌) 7-6 (7/4), 3-6, 6-1తో బెర్టిజ్‌ (బ్రెజిల్‌)పై, క్లారా సురెజ్‌ నవరో (స్పెయిన్‌) 7-6 (7/2), 7-6 (7/4)తో పర్మెంటియర్‌ (ఫ్రాన్స్‌)పై, ఎల్సె మెర్టెన్స్‌ (బెల్జియం) 7-5, 6-0తో మోనికా నికులెస్క్‌ (రొమేనియా)పై, బార్బర స్ట్రెకోవా 6-3, 7-5తో లారా సెగ్మండ్‌పై విజయం సాధించారు.

పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ రోజర్‌ ఫెదరర్‌ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. ఫెదరర్‌ 6-1, 7-6 (7-3), 6-2తో క్లార్క్‌ (బిట్రన్‌)ను ఓడించాడు. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌ 6-3, 3-6, 7-6 (7-5), 7-6 (7-3)తో కిర్గియోస్‌పై నెగ్గాడు. నిషికోరి (జపాన్‌) 6-4, 6-4, 6-0తో నోరీ (బ్రిటన్‌)పై గెలిచాడు. పురుషుల డబుల్స్‌ మొదటి రౌండ్‌లో రోహన్‌ బోపన్న-పాబ్లో కువాస్‌ (ఉరుగ్వే) జోడీ 4-6, 4-6, 6-4, 6-7 (7/9)తో మార్కస్‌ డానియెల్‌ (న్యూజిలాండ్‌)-వెస్లే కూల్హ్‌ (నెదర్లాండ్‌) ద్వయం చేతిలో ఓడింది.

Story first published: Friday, July 5, 2019, 8:11 [IST]
Other articles published on Jul 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X