Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యాష్లే బార్టీకి షాక్.. కోరి గాఫ్‌కు హలెప్‌ అడ్డుకట్ట

Wimbledon 2019: 15-year-old Cori Gauff, No. 1 ranked Ash Barty out in 4th round

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో మరో స్టార్‌ క్రీడాకారిణి ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) ప్రస్థానం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. బార్టీతోపాటు మూడో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), ఆరో సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) కూడా ప్రిక్వార్టర్స్‌ దాటకుండానే నిష్కమించారు. 15 ఏళ్ల అమెరికా స్టార్‌ కోరి గాఫ్‌ దూకుడుకు ఏడో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) అడ్డుకట్ట వేసింది. హలెప్‌తో పాటు ఎనిమిదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), సెరెనా విలియమ్స్‌ (అమెరికా) కూడా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బార్టీ 6-3, 2-6, 3-6తో అన్‌సీడెడ్‌ అలీసన్‌ రిస్కీ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. తొలి సెట్‌లో ప్రభావం చూపించిన బార్టీ.. తర్వాత రెండు సెట్లలోనూ నిరాశపరిచింది. ఇతర మ్యాచ్‌లో హలెప్‌ 6-3, 6-3తో కోరి గాఫ్‌పై అలవోక విజయం సాధించింది. సెరెనా 6-2, 6-2తో వరుస సెట్లలో కార్లా స్వారెజ్‌ నవారో (స్పెయిన్‌)పై, స్వితోలినా 6-4, 6-2తో పెట్రా మార్టిక్‌ (క్రొయేషియా)పై గెలుపొందారు. ప్లిస్కోవా 6-4, 5-7, 11-13తో కరోలినా ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో.. క్విటోవా 6-4, 2-6, 4-6తో 19వ సీడ్‌ జొహనా కొంటా (బ్రిటన్‌) చేతిలో ఓడిపోయారు.

పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ నోకావ్ జొకోవిచ్‌ (సెర్బియా)తో పాటు మాజీ చాంపియన్స్‌ రోజర్ ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో జొకోవిచ్‌ 6-3, 6-2, 6-3తో ఉగో హంబర్ట్‌ (ఫ్రాన్స్‌)పై, ఫెదరర్‌ 6-1, 6-2, 6-2తో బెరెటిని (ఇటలీ)పై, నాదల్‌ 6-2, 6-2, 6-2తో జొవో సొసా (పోర్చుగల్‌)పై సునాయాస విజయం సాధించారు.

ఇతర ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌ల్లో 21వ సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం) 7-6 (11/9), 2-6, 6-3, 6-4తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్‌)పై, 23వ సీడ్‌ బాటిస్ట అగుట్‌ (స్పెయిన్‌) 6-3, 7-5, 6-2తో బెనొయిట్‌ పెయిర్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గారు. మరో మ్యాచ్‌లో సామ్ క్వెర్రీ(అమెరికా) 6-4, 6-7(7/9), 7-6(7/3), 7-6(7/5)తో టెన్నీస్ సాండ్‌గ్రెన్‌ను చెమటోడ్చి ఓడించాడు. పురుషుల డబుల్స్‌ మూడో రౌండ్‌లో దివిజ్‌ శరణ్‌ (భారత్‌)-మార్సెలో డెమోలైనర్‌ (బ్రెజిల్‌) జంట 5-7, 7-6 (8/6), 6-7 (3/7), 3-6తో టాప్‌ సీడ్‌ కుబోట్‌ (పోలాండ్‌)-మార్సెలో మెలో (బ్రెజిల్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.

Story first published: Tuesday, July 9, 2019, 8:08 [IST]
Other articles published on Jul 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+