Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫెదరర్‌ వింబుల్డన్ రికార్డు బద్దలు: థీమ్‌, క్విటోవా ఇంటికి

Wimbledon 2018: Former winners Petra Kvitova and Maria Sharapova knocked out in first round

హైదరాబాద్: మహిళల సింగిల్స్‌లో 2011, 2014 చాంపియన్ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) ఈసారి వింబుల్డన్‌ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ఎనిమిదో సీడ్‌ క్విటోవా మంగళవారం 4-6, 6-4, 0-6తో సస్నోవిచ్‌ (బెలారస్‌) చేతిలో ఓటమి పాలైంది.

మరోవైపు మిగతా మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో టాప్‌ సీడ్‌ హలెప్‌ (రొమేనియా) 6-2, 6-3తో నరా (జపాన్‌)పై, మూడో సీడ్‌ ముగురుజ (స్పెయిన్‌) 6-2, 7-5తో బ్రాడీ (బ్రిటన్‌)పై, 11వ సీడ్‌ కెర్బర్‌ 7-5, 7-3తో జ్వొనరెవా (రష్యా)పై విజయం సాధించారు.

 తొలి రౌండ్లోనే వెనుదిరిగిన డొమినిక్‌ థీమ్‌

తొలి రౌండ్లోనే వెనుదిరిగిన డొమినిక్‌ థీమ్‌

ఇక, పురుషుల సింగిల్స్‌‌లో ఏడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) తొలి రౌండ్లోనే వెనుదిరిగాడు. గత నెలలో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరి రన్నరప్‌గా నిలిచిన థీమ్‌... మార్కోస్‌ బగ్ధాటిస్‌ (సైప్రస్‌)తో జరిగిన పోరులో 4-6, 5-7తో రెండు సెట్‌లను చేజార్చుకొని మూడో సెట్‌లో 0-2తో వెనుకంజలో ఉన్న దశలో గాయం కారణంగా తప్పుకున్నాడు.

 జ్వెరెవ్‌‌పై విజయం సాధించిన రఫెల్ నాదల్

జ్వెరెవ్‌‌పై విజయం సాధించిన రఫెల్ నాదల్

మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో పదో సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం) 4-6, 3-6, 4-6తో మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు రెండో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఐదో సీడ్‌ డెల్‌పొట్రో (అర్జెంటీనా) రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో నాదల్‌ 6-3, 6-3, 6-2తో డూడీ సెలా (ఇజ్రాయెల్‌)పై, జ్వెరెవ్‌ 7-5, 6-2, 6-0తో డక్‌వర్త్‌ (ఆస్ట్రేలియా)పై, డెల్‌పొట్రో 6-3, 6-4, 6-3తో గొజోవిక్‌ (జర్మనీ)పై గెలిచారు.

ఫెదరర్ రికార్డు బద్దలు కొట్టిన లోపెజ్‌

ఫెదరర్ రికార్డు బద్దలు కొట్టిన లోపెజ్‌

వరుసగా అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లు ఆడిన ప్లేయర్‌గా స్పెయిన్‌ ఆటగాడు ఫెలిసియానో లోపెజ్‌ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో స్విట్జర్లాండ్‌ దిగ్గజం ఫెదరర్‌ (వరుసగా 65) పేరిట ఉన్న ఈ రికార్డుని బద్దలు కొట్టాడు. 36 ఏళ్ల ఫెలిసియానో లోపెజ్‌ వరుసగా 66వ గ్రాండ్‌స్లామ్‌ ఆడి ఈ రికార్డుని సృష్టించాడు.

డెల్‌బోనిస్‌‌పై విజయం సాధించిన లోపెజ్‌

డెల్‌బోనిస్‌‌పై విజయం సాధించిన లోపెజ్‌

2002లో ఫ్రెంచ్‌ ఓపెన్‌తో మొదలెట్టిన లోపెజ్‌ అప్పటి నుంచి ఒక్క గ్రాండ్‌స్లామ్‌కు కూడా దూరం కాలేదు. దీంతో ఫెదరర్ వరుస 65 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును లోపెజ్‌ అధిగమించాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో లోపెజ్‌ 6-3, 6-4, 6-2తో డెల్‌బోనిస్‌ (అర్జెంటీనా)పై గెలిచాడు.

Story first published: Wednesday, July 4, 2018, 9:50 [IST]
Other articles published on Jul 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+