
హైదరాబాద్: లండన్ వేదికగా వింబుల్డన్ టోర్నీ జరుగుతోన్న సంగతి తెలిసిందే. టెన్నిస్ టోర్నీల్లో బాల్ బాయ్స్, బాల్‌గర్ల్స్ కీలకంగా వ్యవహారిస్తుంటారు. టెన్నిస్ ఆటగాళ్లు కొట్టిన సర్వ్‌లకు బంతి బయటకు వెళ్లినా.. కోర్టులో పడినా సర్రున పరుగెత్తుకుంటూ వచ్చి వాటిని తీసుకెళ్తారు.
ఈ క్రమంలో ఒక్కోసారి ఆటగాళ్లు కొట్టిన బంతులు తగిలి గాయపడే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి సంఘటనే వింబుల్డన్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఉబ్బెకిస్థాన్ ప్లేయర్ డెనిస్ ఇస్టోమిన్‌తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు కిరియోస్ కొట్టిన బలమైన సర్వ్ ప్రమాదవశాత్తూ ఒక బాల్‌గర్ల్‌కు తగిలింది.

217 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి తగలడంతో నొప్పి తట్టుకోలేకపోయిన ఆ బాల్ గర్ల్ వెక్కివెక్కి ఏడ్చింది. దాంతో, ఇస్టోమిన్‌తో పాటు కిర్గియోస్ ఆమె దగ్గరికి వచ్చి ఓదార్చారు. మ్యాచ్ అనంతరం రోనిచ్ మాట్లాడుతూ "ఇలా జరిగినపుడు సరదాగా ఉండలేం. బంతి తగలగానే వాళ్ల స్పందనను బట్టి గాయం తీవ్రత చెప్పవచ్చు" అని అన్నాడు.
"మరీ ఎక్కువగా తగిలితేనే ఇలా జరుగుతుంది. బంతి తగిలిన బాలుడికి పెద్దగా ఏమీ కాలేదని అనుకుంటున్నా. కానీ బాలిక కడుపు కింది భాగంలో బంతి బలంగా తాకింది. ఆమె కూడా బాగానే ఉండాలని కోరుకుంటున్నా" అని రోనిచ్ తెలిపాడు. మరోవైపు బంతి తగిలిన వెంటనే చికిత్స కోసం చైర్ అంపైర్ వెంటనే బాల్ గర్ల్‌ను తీసుకెళ్లాడు.