హైదరాబాద్: స్పెయిన్‌కు చెందిన ముగురుజా వింబుల్డన్ వేదికపై కొత్త చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో వీనస్ విలియమ్స్‌పై ముగురుజ గెలుపొందింది. అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్‌పై 7-5, 6-0 తేడాతో విజయం సాధించింది.

దీంతో ముగురుజా తొలిసారి వింబుల్డన్ టైటిల్ సాధించింది. ముగురుజా ఇదే వింబుల్డన్ వేదికపై 2015లో ఫైనల్లో ఓటమిపాలైంది. అదే వీనస్ విలియమ్స్ గెలిచి ఉంటే ఓపెన్ శకం (1968 నుంచి)లో మహిళల గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన అతి పెద్ద వయసు క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించి ఉండేది.