ఫ్రెంచ్ ఓపెన్: సెరెనా-వీనస్ జోడీకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ

హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ జోడీకి వైల్డ్ కార్ట్ ఎంట్రీ లభించింది. రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ అక్కాచెల్లెళ్ల జంట 1999, 2010లో ఇక్కడ డబుల్స్ విజేతగా నిలిచారు. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ జోడీగా బరిలోకి దిగుతున్నారు.
మరోవైపు సెరెనా విలియర్స్ ఈ టోర్నీలో సింగిల్స్‌లోనూ బరిలోకి దిగుతోంది. 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన ఆ తర్వాత ఆమె ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఇదే కావడం విశేషం. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన తర్వాత సెరెనా సెప్టెంబరులో ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
కాగా, ఫ్రెంచ్ ఓపెన్‌కు సంబంధించి గురువారం 'డ్రా' విడుదలైంది. ఆదివారం మొదలయ్యే ఈ టోర్నీలో ఆమె తొలి రౌండ్‌లో క్రిస్టినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో తలపడనుంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) తొలి రౌండ్‌లో కొజ్లోవా (ఉక్రెయిన్)తో ఆడనుంది.
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ మొదటి రౌండ్‌లో డల్గొపలోవ్ (ఉక్రెయిన్)తో పోటీపడనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications