Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చీరల్లో విలియమ్స్ సోదరీమణులు

Williams Sisters
బెంగుళూర్: బెంగుళూర్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా క్రీడాకారుల పార్టీలో విలియమ్స్ సోదరీమణులు భారత సంప్రదాయ వస్త్రాలు ధరించి కనువిందు చేశారు. చీరలు, జాకెట్లు ధరించి ఆదివారం రాత్రి పార్టీకి కొత్త అందాన్ని సంతరించి పెట్టారు. ఫ్యాషన్ షోలకు పెట్టింది పేరయిన సెరీనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ చీరల్లో తమ అందాలను ఆరబోశారు. చేతులు ఊపుతూ, గాలి ముద్దులు విసురుతూ వారు లీలా మహల్ లో జరిగిన ఫంక్షన్ లో అందరినీ ఆనందింపజేశారు.

ఆర్ట్ గ్రాడ్యుయేట్ అయిన వీనస్ తనకు చీరలంటే మక్కువ ఏర్పడిందని చెప్పింది. కానీ వీటితో ఓ సమస్య ఉందని, తాను సొంతంగా చీర కట్టుకోలేనని, చీర కట్టుకోవడం ఇదే చివరి సారి కావచ్చునని ఆమె అంటూ మీకు కావాల్సినన్ని ఫొటోలు తీసుకోండని ఫోజులు ఇచ్చింది. వీనస్ చెల్లెలు సెరినా మాత్రం భారత వస్త్రధారణ ఎంతో సౌకర్యం ఉందని, వీటిని మళ్లీ మళ్లీ ధరిస్తానని చెప్పింది.
Story first published: Monday, March 3, 2008, 13:51 [IST]
Other articles published on Mar 3, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+