Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యుఎస్ ఓపెన్‌లో ఫెదరర్‌నే వణికించాడు: ఎవరీ సుమిత్ నగల్?

Who is Sumit Nagal? Everything You Should Know About This 22-year-old Sensation

హైదరాబాద్: 20 గ్రాండ్ స్లామ్ ట్రోఫీలను గెలిచిన స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు యుఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లో భారత టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నగల్ ముచ్చెమటలు పోయించాడు. ఈ మ్యాచ్ భారత టెన్నిస్ అభిమానులకు సరైన మజాను అందించింది.

తన తొలి గ్రాండ్‌స్లామ్‌లో అరంగేట్రంలోనే రోజర్ ఫెదరర్ లాంటి టెన్నిస్ దిగ్గజంపై హర్యానాకు చెందిన 22 ఏళ్ల సుమిత్ నగల్ తొలి సెట్‌ను నెగ్గడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం 190వ ర్యాంకులో ఉన్న సుమిత్ నగల్ క్వాలిఫయిర్స్ ద్వారా యుఎస్ ఓపెన్‌కు ఎంపికయ్యాడు.

తొలి సెట్‌లోనే ఫెద‌ర‌ర్‌కు ముచ్చెమటలు పట్టించాడు. రెండున్నర గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ అద్భుత ఆటతో 6-4 తేడాతో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే అనంతరం వరుస సెట్‌లలో ఫెద‌ర‌ర్‌ పుంజుకోవడంతో సుమిత్ ఓటమిని చవిచూశాడు.

యుఎస్‌ ఓపెన్‌లో శుభారంభం

యుఎస్‌ ఓపెన్‌లో శుభారంభం

ఫెద‌ర‌ర్‌ 4-6, 6-1, 6-2, 6-4 తేడాతో సుమిత్‌పై విజయం సాధించి యుఎస్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. కాగా, మ్యాచ్‌కు ముందు సమిత్ నగల్ మాట్లాడుతూ "ఇది గేమ్ గెలవడం లేదా ఓడిపోవడం గురించి కాదు. ఇది అనుభవం మాత్రమే. ఇది 20 గ్రాండ్ స్లామ్‌లను గెలుచుకున్న వ్యక్తితో ఆడుతోంది" అని తెలిపాడు.

కామెంటేటర్లు నా గురించి ఏం చెబుతున్నారో

కామెంటేటర్లు నా గురించి ఏం చెబుతున్నారో

"టీవీల్ కామెంటేటర్లు నా గురించి ఏం చెబుతున్నారో నాకు అనవసరం. ప్రపంచంలోనే ది బెస్ట్ టెన్నిస్ ప్లేయర్‌తో ఆడుతున్నాను. ఇక్కడ ఉన్న క్రౌడ్‌తో ఎంజాయ్ చేస్తున్నాను. ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన ఓ ఆటగాడిని. నా పేరు వచ్చేవరకు నేను బాగానే ఉన్నాను" అని సుమిత్ నగల్ ఏటీపీ టూర్.కామ్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.

2015లో వియత్నాంకు చెందిన

2015లో వియత్నాంకు చెందిన

2015లో వియత్నాంకు చెందిన నామ్ హోంగ్ లేతో కలిసి సుమిత్ నగల్ వింబుల్డన్ బాయ్స్ డబుల్స్ టైటిల్‌ని గెలుచుకున్నాడు. తద్వారా జూనియర్ గ్రాండ్ స్లామ్ ట్రోఫీని నెగ్గిన ఆరో భారత ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించాడు. 2017లో భుజం గాయానికి శస్త్రచికిత్స అనంతరం కొన్నాళ్ల పాటు ఆటకు దూరమయ్యాడు.

2017 బెంగళూరు ఓపెన్‌ టర్నింగ్ పాయింట్‌

2017 బెంగళూరు ఓపెన్‌ టర్నింగ్ పాయింట్‌

తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా 2017 బెంగళూరు ఓపెన్‌ను పేర్కొనొచ్చు. ఈ టోర్నీ తర్వాత అతడు వరుస విజయాలతో దూసుకుపోతూ తన ర్యాంకుని సైతం మరింతగా మెరుగుపరచుకున్నాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 190 ర్యాంకులో గత వారమే న్యూయార్క్‌లో యుఎస్ ఓపెన్ కోసం అడుగుపెట్టాడు.

రోజర్ ఫెదరర్ చేతిలో ఓటమి

యుఎస్ ఓపెన్‌ తొలి రౌండ్‌లో రోజర్ ఫెదరర్ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ... తన ఆటతీరుతో భారత టెన్నిస్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. భారత భవిష్యత్తు టెన్నిస్ ఆశాకిరణంగా నిలిచాడు. తొలి సెట్‌లో ఫెద‌ర‌ర్‌కు షాక్ ఇచ్చిన తీరుకు టెన్నిస్ పండితులు సుమిత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సుమిత్‌ ఓడిపోయినప్పటికీ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు అని అంటున్నారు.

Story first published: Tuesday, August 27, 2019, 14:16 [IST]
Other articles published on Aug 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+