For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తెలుగోడు బసవరెడ్డి - అరంగేట్రంలోనే జకోవిచ్‌తో సై

నిశేష్‌ బసవారెడ్డి.. ప్రస్తుతం ఈ తెలుగు పేరు టెన్నిస్ ప్రపంచంతో పాటు భారత క్రీడాభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇతను ఎవరు అనేది తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అందుకు కారణం.. తాజాగా జరగనున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో నొవాక్‌ జకోవిచ్‌తో తలపడే ప్రత్యర్థి ఇతడే. తెలుగు మూలాలున్న ఈ అమెరికా కుర్రాడు గ్రాండ్‌స్లామ్‌ అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడైన జకోవిచ్ తో పోటీ పడబోతుండటం విశేషం.

నిశేష్‌ బసవారెడ్డి ఎవరంటే?
నిశేష్‌ తల్లిదండ్రుల పేర్లు మురళీకృష్ణ, సాయిప్రసన్న. వీరిది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు. అయితే 1999లో నిశేష్‌ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. దీంతో కాలిఫోర్నియాలో జన్మించాడు నిశేష్‌. ప్రస్తుతం 19 ఏళ్లు. నిశేష్‌కు తెలుగు బాగా అర్థం అవుతుందట. కానీ మాట్లాడడం కొద్దిగా మాత్రమే వచ్చని అతడే స్వయంగా చెప్పాడు.

Who Is Nishesh Basavareddy Teenager Who Will Play Novak Djokovic In Australian Open Round 1

టెన్నిస్ అంటే ఇష్టం
నిశేష్‌కు చిన్నప్పటి నుంచే టెన్నిస్‌పై మక్కువ పెంచుకున్నాడు. దీంతో ఆట నేర్చుకోవడం ప్రారంభించిన అతడు.. అమెరికా స్టార్‌ ప్లేయర్ రాజీవ్‌ రామ్‌, కోచ్‌ బ్రయాన్‌ స్మిత్‌ మార్గనిర్దేశనంలో ఆటపై పట్టు సాధించాడు. ప్రస్తుతం సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లోనూ అదిరే ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. 2022లో ఒజాన్‌ బారిస్‌తో కలిసి యుఎస్‌ ఓపెన్‌ బాలుర డబుల్స్‌ టైటిల్‌ను ముద్దాడాడు.

2024 యుఎస్‌ ఓపెన్ లో క్వాలిఫయింగ్‌ టోర్నీ ఆడాడు. అందులో మూడో రౌండ్‌ వరకు వెళ్లగలిగాడు. ఇక ఈ ఏడాదే సీనియర్‌ సర్క్యూట్‌లోకి వచ్చాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో మెయిన్‌డ్రా ఆడేందుకు వైల్డ్‌కార్డ్‌ దక్కించుకున్నాడు. 2024 నెక్స్ట్‌ జనరేషన్‌ ఏటీపీ ఫైనల్స్‌కు కూడా అర్హతను పొందాడు. ప్రస్తుతం సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో నిశేష్ 133వ స్థానంలో కొనసాగుతున్నాడు.

అయితే నిశేష్ ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మొదటి మ్యాచులోనే నొవాక్‌ జకోవిచ్‌ను ఎదుర్కోవడం అంత సులభమేమి కాదు. దీంతో అతడు జకోవిచ్ ను ఎలా ఎదుర్కొంటాడనేది ప్రస్తుతం తెలుగు క్రీడాభిమానుల్లో ఆసక్తిగా మారింది.

Story first published: Friday, January 10, 2025, 9:48 [IST]
Other articles published on Jan 10, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+