For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Priceless Photo: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రోజర్ ఫెదరర్‌తో విరుష్క జోడీ

When legends meet: Virat Kohli posts priceless photo with Roger Federer at Australian Open

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, ఓ అరుదైన ఫోటోతో దానిని మరింత గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. ఆసీస్ పర్యటనలో వీలు చిక్కినప్పుడల్లా భార్య అనుష్కశర్మతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

భార్య అనుష్క శర్మతో కలిసి శనివారం మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీని కోహ్లీ వీక్షించేందుకు వెళ్లాడు. రాడ్‌ లేవర్‌ ఎరీనాలో తమ అభిమాన ఆటగాడు, స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌ను రాడ్ లీవర్ ఎరీనాలో కలిసి కొద్దిసేపు సరదాగా గడిపారు. ముగ్గురు కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు.

When legends meet: Virat Kohli posts priceless photo with Roger Federer at Australian Open

ఫెదరర్‌తో దిగిన ఫొటోను కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. "ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరిచిపోలేని రోజు. ఆస్ట్రేలియా సమ్మర్‌ను విజయవంతంగా ముగించడం చాలా సంతోషంగా ఉంది. ఆసీస్ ఓపెన్ ఎప్పటికీ గ్రేట్‌ఫుల్" అని కామెంట్‌తో ఫోటోని పోస్టు చేశాడు. మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్ అధికారిక ట్విట్టర్ ముగ్గురు దిగ్గజాలు ఒక ఫొటోలో అని ట్వీట్ చేసింది.

శనివారం రాడ్ లీవర్ ఎరీనాలో సెర్బియా టెన్నిస్ కింగ్ నోవాక్ జొకోవిచ్, డెనిస్ షపలోవ్ మ్యాచ్‌తో పాటు సెరెనా విలియమ్స్ పోరును కోహ్లీ-అనుష్క జోడీ ప్రత్యక్షంగా వీక్షించింది. భగభగ మండుతున్న ఎండలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఆస్వాదిస్తూ గడిపింది.

Story first published: Sunday, January 20, 2019, 11:41 [IST]
Other articles published on Jan 20, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+