Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాప్ లెస్‌గా పాట పాడిన సెరెనా విలియమ్స్(వీడియో)

Watch Serena Williams Sing “I Touch Myself” for Breast Cancer Awareness Initiative

న్యూ ఢిల్లీ: నల్లకలువ.. అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ టాప్ లెస్‌గా పాట పాడి ఓ సరికొత్త ప్రచారానికి నాంది పలికారు. యావత్ మహిళా లోకం మేల్కోవాలనే తలంపుతో ఆమె ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొన్ని నెలల కిందటే తల్లి అయిన సెరెనా విలియమ్స్ మహిళలకు కొన్ని విషయాల పట్ల అవగాహన కలగాలని తరచూ స్పందిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రొమ్ము కేన్సర్ అవగాహన నెల సందర్భంగా ఆమె 'ఐ ట్ మై సెల్ఫ్' అనే పాటను ఆలపించారు.

మహిళలు తమ వక్షోజాలను తరచుగా పరిశీలించుకోవాలని గుర్తు చేస్తూ ఆమె ఈ పాట పాడారు. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. 'ఇది నాకంత సౌకర్యంగా లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందర్నీ బ్రెస్ట్ కేన్సర్ ప్రభావితం చేస్తోంది, వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ పని చేశా'నని ఆమె చెప్పారు.

'రొమ్ము కేన్సర్‌ను ముందుగానే ఈ వ్యాధిని గుర్తించడం ముఖ్యం. ఇది చాలా ప్రాణాలను కాపాడుతుందని సెరెనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వక్షోజాలను తరచుగా పరిశీలించుకోవాలని మహిళలకు ఈ వీడియో గుర్తు చేస్తుందని భావిస్తున్నా' సెరెనా తెలిపారు.

సెరెనా 2017లో కూతురు అలెక్సిస్‌ ఒలంపియా ఒహానియన్‌ జూనియర్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ ఏడాదిలో తిరిగి కోర్టులోకి అడుగుపెట్టిన సెరేనా సరిగా ఆడలేపోయింది. ఏకంగా 12గేమ్స్‌లో ఫైనల్ వరకూ వచ్చి ఓడిపోయింది. శాయశక్తులా పోరాడి తన టాప్ ఫామ్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాను ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఫలితం రాకపోవడంతో ఆమెపై వస్తున్న రూమర్లు హద్దు మీరాయి.

Story first published: Sunday, September 30, 2018, 12:44 [IST]
Other articles published on Sep 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+