టెన్నిస్ కోర్టులో క్రికెట్ ఆడిన ఫెదరర్‌కు ఐసీసీ నంబర్‌వన్ ర్యాంకు (వీడియో)


హైదరాబాద్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు ఐసీసీ ప్రవేశపెట్టిన టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. అదేంటి... క్రికెటర్లకు కదా ఐసీసీ ర్యాంకులు ఇచ్చేది. ఓ టెన్నిస్ ఆటగాడికి ఐసీసీ ర్యాంకు ఏంటీ? ఇదెలా సాధ్యం అనే కదా మీ సందేహం.
లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టోర్నీలో రోజర్ ఫెదరర్ టెన్నిస్ బంతితో క్రికెట్ తరహా ఢిఫెన్స్ షాట్ ఆడాడు. దీంతో నిర్వాహకులు ఐసీసీని ఫెదరర్‌కు ఏ ర్యాంకు ఇస్తారని కోరగా.. ఐసీసీ ఫెదరర్‌కు నంబర్‌వన్ ర్యాంకును కట్టబెట్టింది. ఈ మేరకు ఐసీసీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.
టెన్నిస్ బంతితో క్రికెట్ తరహా ఢిఫెన్స్
రికార్డుస్థాయిలో తొమ్మిదో వింబుల్డన్ టైటిల్‌పై గురి పెట్టిన స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్ సోమవారం ప్రిక్వార్టర్స్‌లో భాగంగా మన్నారినో(ఫ్రాన్స్)తో తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఫెదరర్ టెన్నిస్ బంతితో క్రికెట్ తరహా ఢిఫెన్స్ షాట్ ఆడాడు. దీంతో మ్యాచ్ చూస్తున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సోషల్ మీడియాలో వీడియో వైరల్
వింబుల్డన్ నిర్వాహకులు రోజర్ ఫెదరర్ ఆడిన షాట్‌కు సంబంధించిన వీడియోను ట్విటర్ ద్వారా పంచుకుని రేటింగ్ ఇవ్వాల్సిందిగా ఐసీసీని కోరింది. ఇందుకు స్పందించిన ఐసీసీ టెస్టుల్లో నంబర్‌వన్ బ్యాట్స్‌మెన్ ర్యాంకును ఇచ్చినట్లు తెలిపింది. దీనిపై టెన్నిస్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు.
వింబుల్డన్: క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఫెదరర్
ఇక, ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫెదరర్ 6-0, 7-5, 6-4తో ఫ్రాన్స్ క్రీడాకారుడు అడ్రియన్ మనారినోపై వరుససెట్లలో విజయం సాధించాడు. తొలిసెట్‌లో ప్రత్యర్థికి ఒక్క గేమ్‌కు కూడా అవకాశమివ్వని ఫెదరర్.. ఆ సెట్‌ను కేవలం 16 నిమిషాల్లోనే ముగించి సత్తా చాటాడు. ఎనిమిదిసార్లు వింబుల్డన్ విజేత అయిన 36 ఏళ్ల ఫెడరర్‌కిది వరుసగా 32వ సెట్ విజయం.

వరుసగా 20వసారి వింబుల్డన్ టోర్నీలో
వరుసగా 20వసారి వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న ఫెదరర్ 16వసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మొత్తంగా ఫెదరర్ తన కెరీర్‌లో 53వసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో అండర్సన్‌తో ఫెడరర్ తలపడనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications