న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల్లి కాబోతున్న సానియా టెన్నిస్‌ను వీడలేకపోతుంది (వీడియో)

By Nageshwara Rao
WATCH: Pregnant Sania Mirza cannot keep herself away from tennis court

హైదరాబాద్: గర్భం ధరించిన కారణంగా భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా గత కొంతకాలంగా అంతర్జాతీయ టెన్నిస్‌ నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్లుగా అంతర్జాతీయ టెన్నిస్‌లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా కొనసాగుతున్న సానియా మిర్జా 3 నెలలకు మించి ఎక్కువ కాలం టెన్నిస్‌కు దూరంగా ఉండలేదు.

అయితే, తల్లి కాబోతున్న సానియా గత 7 నెలలుగా ప్రొఫెషనల్ టెన్నిస్‌కు తాత్కాలికంగా దూరమైంది. సానియా ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. త్వరలో తల్లి కాబోతున్న సానియా టెన్నిస్‌కు దూరంగా ఉండటం తన వల్ల కాదంటోంది. టెన్నిస్ ఆటపై తనకున్న ప్రేమను సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వ్యక్తం చేస్తోంది.

ఒక ప్లేయర్‌‌ను టెన్నిస్ నుంచి కొంతకాలమే దూరం చేయగలరు, కానీ ఆ ప్లేయర్‌లోని టెన్నిస్‌ను దూరం చేయలేరని సానియా మీర్జా గత వారమే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సానియా రెండు రోజుల క్రితం తన సోదరి ఆనమ్‌ మీర్జాతో కలిసి టెన్నిస్‌ ఆడుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.

ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఆనమ్‌తో కలిసి టెన్నిస్‌ ఆడుతున్న సానియా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ "ఎంత ప్రయత్నించినా టెన్నిస్‌ దూరంగా ఉండలేకపోతున్నాను. టెన్నిస్‌ క్రీడాకారుల నుంచి కోర్టును దూరం చేయగలరేమో కానీ, ఆటను కాదు కదా" కామెంట్ పెట్టింది.

ఈ వీడియోను చూసిన ఆమె అభిమానులు తమ అభిమాన క్రీడాకారిణి ఏడు నెలల గర్భిణిగానూ అదరగొట్టేసిందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'మామ్‌ సానియా ఈజ్‌ బ్యాక్‌', 'ఆనమ్‌.. సానియాపై గెలవడానికి నీకిదే మంచి అవకాశం', ఆటకు తాత్కాలిక విరామం ఇచ్చినా ఛాంపియన్‌ ఎప్పటికైనా ఛాంపియనే' అని కామెంట్లు పెడుతున్నారు.

తాను గర్భం దాల్చిన విషయాన్ని సైతం సానియా మిర్జా తనదైన శైలిలోనే వినూత్నంగా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఒక్క గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించలేకపోయిన సానియా మిర్జా ఉమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో కలిపి 6 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గింది. 2010లో పాక్ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను సానియా వివాహం చేసుకున్న తెలిసిందే.

#BabyMirzaMalik 👶🏽❤️ @daaemi

A post shared by Sania Mirza (@mirzasaniar) on

Story first published: Thursday, August 9, 2018, 18:28 [IST]
Other articles published on Aug 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X