సానియా మిర్జా ఫిదా: బాలీవుడ్ పాటకు అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ డ్యాన్స్ (వీడియో)

హైదరాబాద్: అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ అలిసన్ రిస్కె ఓ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసి అభిమానులను అలరించింది. ప్రస్తుతం 37వ ర్యాంకులో ఉన్న అలిసన్ రిస్కె ఇటీవలే ముగిసిన వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్‌లో సెరెనా విలియమ్స్‌తో మూడు సెట్లలో ఓడిపోయింది.
మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్
మాజీ ఇండియన్ డేవిస్ కప్ ప్లేయర్, కెప్టెన్ ఆనంద్ రాజ్ కొడుకైన స్టీఫెన్ ఆనంద్ రాజ్‌ని పెళ్లాడబోతున్న సందర్భంగా అలిసన్.. బాలీవుడ్‌లోని ప్రముఖ పాపులర్ "బార్ బార్ దేఖో" హిందీ మూవీలోని ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఈ వీడియోని చూసిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అలిసన్‌కి కంగ్రాట్స్ చెప్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. కాగా, ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అలిసన్ త్వరగానే పెళ్లి చేసుకుంటుంది. 29 ఏళ్ల అలిసన్ ఇప్పటివరకు ఒక్క గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను కూడా గెలవలేకపోయింది.
ఆమె అత్యుత్తమ ప్రదర్శన ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరుకోవడం. ఇక, ప్రెంచ్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు యుఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌కు అర్హత సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications