For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోహ్లీకి చాలెంజ్‌ విసిరిన ఫెడరర్‌.. ఇంతకు అదేంటో తెలుసా?

Virat Kohli challenged by Swiss maestro Roger Federer amid coronavirus lockdown
Roger Federer Nominates Virat Kohli For 'Training From Home' Challenge

జెనీవా: స్విస్‌ టెన్నిస్‌ లెజెండ్‌ రోజర్ ఫెదరర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లు. ప్రస్తుత తరం క్రికెటర్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టగా.. ఫెదరర్ ఇప్పటికే 20 గ్రాండ్ స్లామ్‌లను గెలుచుకున్నాడు. ఇద్దరూ వారి వారి ఆటలలో అత్యుత్తమ స్థాయిలో కొనసాగుతున్నారు. అయితే తాజాగా కోహ్లీకి ఫెడరర్‌ నుంచి ఓ చాలెంజ్‌ ఎదురైంది.

కరోనా మహమ్మారి కారణంగా ఇంటికే పరిమితమైన రోజర్‌ ఫెడరర్‌.. విరాట్‌ కోహ్లీ సహా అనేక మంది సెలెబ్రిటీలకు ఓ సరదా చాలెంజ్‌ (#ట్రైనింగ్ ఫ్రమ్ హోమ్) విసిరాడు. ఒక్కడే టెన్నిస్‌ రాకెట్‌తో బంతిని కొడుతూ.. సోలో డ్రిల్‌ చేస్తున్న వీడియోను ఫెడరర్‌ పోస్ట్‌ చేశాడు. 'అందరికీ ఉపయోగకరమైన సోలో డ్రిల్‌. మీరెలా చేస్తారో వీడియోతో రిప్లై ఇవ్వండి. నేను కొన్ని చిట్కాలను అందిస్తాను' అని ఫెడరర్‌ ట్వీట్‌ చేశాడు. వీడియోలో ఫెడెక్స్ బంతిని గోడపై పలుసార్లు డ్రిల్‌ చేయడం చూడొచ్చు. అతడు టోపీతో సహా పూర్తిగా తెల్లటి బట్టలు ధరించడం కనిపిస్తుంది.

రోజర్ ఫెదరర్ తాను చేసినట్టు చేసి తనకు పంపాలని అనేక మంది సెలెబ్రిటీలకు #ట్రైనింగ్ ఫ్రమ్ హోమ్ చాలెంజ్‌ విసిరాడు. అందులో మన విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. కోహ్లీతో పాటు టోని క్రూస్, జియాన్లూయిగి బఫన్, టామ్ బ్రాడి, క్రిస్టియానో ​​రొనాల్డో, లుకా మోడ్రిక్, కోకో గాఫ్, స్టీఫెన్ కర్రీ, ది రాక్‌లకు ఫెదరర్ చాలెంజ్‌ విసిరాడు.

రోజర్‌ ఫెదరర్‌ ఇప్పటికే తన పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌పై పోరాడేందుకు తన వంతు సాయం ప్రకటించాడు. ఫెదరర్‌ రూ.7.75 కోట్లను విరాళంగా ప్రకటించాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ప్రపంచంలో కరోనా వల్ల అత్యంత ప్రభావితమైన దేశాల్లో స్విట్జర్లాండ్‌ తొమ్మిదో స్థానంలో ఉంది. ఇప్పటివరకు దాదాపు 10 వేల మందికి కరోనా సోకగా.. సుమారు 100 మంది మృతిచెందారు.

స్విట్జర్లాండ్‌లో రోజురోజుకు కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో అక్కడి వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. తనను ఎంతో అభిమానించే ప్రజల రక్షణ కోసం ఫెదరర్‌ కూడా తన వంతు సాయం ప్రకటించాడు. విషయం తెలుసుకున్న ప్రజలు ఫెదరర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Story first published: Wednesday, April 8, 2020, 11:46 [IST]
Other articles published on Apr 8, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+