న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెల్ఫ్‌ ఐసోలేషన్‌‌లో ఉంటానని.. క్లబ్‌లో పార్టీ చేసుకున్న స్టార్ ప్లేయర్ (వీడియో)!!

Viral video of Alexander Zverev partying after promising self-isolation creates stir

బెర్లిన్‌: ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్‌ జొకోవిచ్‌ ఆడించిన ఆటతో కరోనా వైరస్ పాజిటివ్‌ బాధితుల సంఖ్య పెరిగిపోయిన విషయం తెలిసిందే. మహమ్మారి విషయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో జొకోవిచ్‌ సహా గ్రిగర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా), బోర్నా చోరిచ్ (క్రొయేషియా), నొవాక్‌ ఫిట్‌నెస్‌ కోచ్‌ గొరాన్‌ ఇవానిసెవిచ్‌ వైరస్ బారిన పడ్డారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందుల్లో పడిన వర్ధమాన టెన్నిస్‌ క్రీడాకారుల కోసం నిధులు సేకరించాలనే ఉద్దేశంతో జొకోవిచ్‌ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్‌ టోర్నీ నిర్వహించగా.. ఇప్పుడు అది వారికి శాపంలా మారింది.

రూల్స్ బ్రేక్:

అడ్రియా టూర్‌ ఎగ్జిబిషన్‌ టోర్నీలో ఆడి వైరస్ బారిన పడిన ఆటగాళ్లు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు టోర్నీలో ఆడిన మిగతా ఆటగాళ్లను సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని టెన్నిస్ సంఘం, ఆ దేశ ప్రభుత్వం సూచించింది. అయితే జర్మనీకి చెందిన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ మాత్రం రూల్స్ బ్రేక్ చేశాడు. సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండకుండా పార్టీ చేసుకున్నాడు. ఒక క్లబ్‌లో భారీ జన సందోహంలో జ్వెరెవ్‌ పార్టీ చేసుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో అతడు విమర్శల పాలయ్యాడు.

 డాన్స్ చేస్తూ క్లబ్‌లో సందడి:

డాన్స్ చేస్తూ క్లబ్‌లో సందడి:

ఆడ్రియా టూర్ ఎగ్జిబిషన్‌ టోర్నీలో పాల్గొన్నందుకు అలెగ్జాండర్‌ జ్వెరెవ్.. జర్మనీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. అభిమానులకు క్షమాపణలు చెప్పి సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటానని మాటిచ్చాడు. సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండకుండా ఎంచక్కా పార్టీ చేసుకున్నాడు. డాన్స్ చేస్తూ క్లబ్‌లో సందడి చేశాడు. వీడియో, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకున్న జెర్మనీ ప్రజలు జ్వెరెవ్‌ను సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు.

సెల్ఫ్‌ ఐసోలేషన్ అంటే ఇదేనా:

సెల్ఫ్‌ ఐసోలేషన్ అంటే ఇదేనా:

'ఒక ప్రైవేట్‌ క్లబ్‌లో జ్వెరెవ్‌ చిందులు వేస్తూ కనిపించడం క్లియర్‌గా కనిపించింది. ఇదేనా సెల్ఫ్‌ ఐసోలేషన్ అంటే‌' అంటూ ఒకరు విమర్శించగా.. 'ఆరు రోజుల క్రితం ఏమి చెప్పావ్‌ జ్వెరెవ్‌.. ఇప్పుడు ఏమి చేస్తున్నావ్‌' అంటూ మరొకరు మండిపడ్డారు. 'ఆటగాళ్లు రూల్స్‌ ఫాలో కావడంలేదనే దానికి ఇదొక ఉదాహరణ. ఇది చాలా బాధపెట్టే అంశం. మిగతా వారిని కూడా ప్రమాదంలోకి నెట్టడం భావ్యమా' అని మరొకరు విమర్శించారు. 'పబ్లిక్‌కు సంబంధించి గైడ్‌లైన్స్‌ ఉన్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా.. ఇదే ఒక సెలబ్రెటీగా నువ్వు ఇచ్చే సందేశం' అని అభిమానులు విరుచుకుపడుతున్నారు.

సెర్బియా అంచె పోటీలు ముగిశాక:

సెర్బియా అంచె పోటీలు ముగిశాక:

అడ్రియా టూర్‌లో సెర్బియా అంచె పోటీలు ముగిశాక.. క్రొయేషియాలో రెండో అంచె పోటీలు నిర్వహిస్తుండగా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కోవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ఫైనల్‌ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక నిర్వాహకుడు, ఆటగాడు జొకోవిచ్‌ సహా మరో ముగ్గురు ప్లేయర్లు దిమిత్రోవ్‌, కోరిచ్‌, ట్రయోకీలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగానే ఉండడం సంతోషకర విషయం.

Story first published: Monday, June 29, 2020, 13:01 [IST]
Other articles published on Jun 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X