సీటీఎల్: హైదరాబాద్ ఏసెస్ లోగో ఆవిష్కరణ (ఫోటోలు)
హైదరాబాద్: ఛాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో భాగంగా హైదరాబాద్ ఏసెస్ జట్టు ఆడనుంది. గురువారం ఈ జట్టు ప్రాంఛైజీని నిర్వాహకులు హైదరాబాద్‌లో ప్రారంభించారు. భారత మాజీ టెన్నిస్ ఆటగాడు విజయ్ అమృత్ రాజ్ హైదరాబాద్ ఏసెస్ జట్టు లోగోను ఆవిష్కరించాడు.
భారత టెన్నిస్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, జూనియర్ క్రీడాకారులు దూసుకొస్తున్నారని అమృత్ రాజ్ అన్నాడు. "టెన్నిస్ క్రీడాకారులు.. సీటీఎల్‌లో ఆడుతున్నారా, ఏటీపీ, డబ్ల్యూటీఏ టోర్నమెంటుల్లో ఆడుతున్నారా అనేది సమస్య కాదు. వారి వారి అర్హతలను బట్టి అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవచ్చు. ఇటీవల హైదరాబాదీ సానియా మిర్జా అధ్బుత ప్రదర్శన చేస్తోంది."
గతంలో గాయలతో బాధపడి ఫిట్ నెస్ సమస్యను ఎదుర్కొన్నప్పటికీ ఆమె కోలుకుని రాణించడం శుభ పరిమాణం. ఛాంపియన్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్) వల్ల భారత్‌లో టెన్నిస్‌కు మంచి రోజులు వస్తాయనే నమ్మకముంది. అంతర్జాతీయ క్రీడాకారులతో ఆడటం వల్ల యువ ఆటగాళ్లకు మేలు జరగనుంది" అని అమృత్ రాజ్ పేర్కొన్నాడు.

హైదరాబాద్ ఏసెస్ లోగోని ఆవిష్కరించిన అమృత్ రాజ్
ఛాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో భాగంగా హైదరాబాద్ ఏసెస్ జట్టు ఆడనుంది. గురువారం ఈ జట్టు ప్రాంఛైజీని నిర్వాహకులు హైదరాబాద్‌లో ప్రారంభించారు. భారత మాజీ టెన్నిస్ ఆటగాడు విజయ్ అమృత్ రాజ్ హైదరాబాద్ ఏసెస్ జట్టు లోగోను ఆవిష్కరించాడు.

హైదరాబాద్ ఏసెస్ లోగోని ఆవిష్కరించిన అమృత్ రాజ్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సీటీఎల్ టోర్నమెంట్‌లో టెన్నిస్‌కు మంచి రోజులు వస్తాయనే నమ్మకముందని అన్నారు.

హైదరాబాద్ ఏసెస్ లోగోని ఆవిష్కరించిన అమృత్ రాజ్
ఈ కార్యక్రమంలో విజయ్ అమృత్ రాజ్ కుమారుడు, మాజీ టెన్నిస్ ఆటగాడు ప్రకాష్ అమృత్ రాజ్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హైదరాబాద్ ఏసెస్ యాజమాన్య ప్రతినిధులైన రాజేష్ రాజు, మాజీ జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు డా. కె. రామరాజు పాల్గొన్నారు.

ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకూ కొనసాగే సీటీఎల్‌లో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. ఈ నెల 17న నగరంలోని ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్‌లో జరిగే పోటీలో హైదరాబాద్ ఏసెస్, బెంగుళూరుతో తలపడనుంది. తర్వాత 18న పుణెతో పోటీ పడుతుంది.

హైదరాబాద్ ఏసెస్ జట్టు మాజీ ప్రపంచ నెంబర్ వన్ మార్టినా హింగిస్‌తో పాటు మార్క్ ఫిలిఫ్పోసిస్, మైకెల్ యోజ్నీ లాంటి క్రీడాకారులున్నారు. పురుషులు, మహిళల సింగిల్స్ తో పాటు లెజెండ్ పోటీలను ఈ టోర్నీలో నిర్వహిస్తారు. విజేతకు రూ. 1 కోటి రూపాయలు, ద్వితీయ విజేతకు రూ. 50 లక్షలు బహుమతిగా అందజేస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications