For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిన్ను ‘మేక’ అని ఎందుకు పిలుస్తారు?: ఫెదరర్‌కు ఊహించని ప్రశ్న

టెన్నిస్‌లో 19 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించి చరిత్ర సృష్టించిన దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్‌కు ఓ చిన్నారి నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.

By Nageshwara Rao

హైదరాబాద్: టెన్నిస్‌లో 19 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించి చరిత్ర సృష్టించిన దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్‌కు ఓ చిన్నారి నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. యుఎస్ ఓపెన్‌లో భాగంగా ఓ కార్యక్రమంలో చిన్నారులతో ముచ్చటించిన ఫెదరర్ ఊహించని ప్రశ్నతో అవాక్కై ఆ తర్వాత చిరునవ్వుతో సమాధానమిచ్చాడు.

'నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను' అంటూ మొదలుపెట్టిన ఆ చిన్నారి స్విట్జర్లాండ్ చాలా కూల్‌గా ఉంటుంది? నిజమేనా? అంటూ ప్రశ్నించాడు. అనంతరం అక్కడ చాలా జంతువులు ఉండగా మిమ్మల్ని అభిమానులు 'మేక' అని ఎందుకు పిలుస్తారు? అని పశ్నించాడు.

Video: Kid interviews Roger Federer, asks why he’s nicknamed ‘GOAT’

చిన్నారి ప్రశ్నతో ఫెదరర్ సహా అక్కడున్న అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ వెంటనే ఫెదరర్ తేరుకుని చిరునవ్వుతో ఆ చిన్నారి ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. కొందరు అభిమానులు నన్ను అలా పిలుస్తుంటారు. అయితే నన్ను నేను మాత్రం అలా పిలుచుకోను అంటూ బదులిచ్చాడు.

అంతేకాదు మేకలు కూడా జంతువుల్లో ఓ భాగమే కదా! అనడంతో అక్కడ నవ్వులు పూశాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+