Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీకి వీనస్‌ విలియమ్స్ దూరం

Venus Williams pulls out of Brisbane International, cites setback in training

హైదరాబాద్: బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీకి అమెరికన్ టెన్నిస్ స్టార్ వీనస్‌ విలియమ్స్‌ దూరమైంది. గాయం కారణంగా తాను టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు వీనస్‌ బుధవారం అధికారిక ప్రకటన చేసింది. జనవరి 6 నుంచి 12 వరకు బ్రిస్బేన్‌లోని క్వీన్స్‌లాండ్ టెన్నిస్ సెంటర్‌లో ఈ టోర్నీ జరగనుంది.

39 ఏళ్ల వీనస్ విలియమ్స్ ఈ టోర్నీలో ఆశ్లే బార్టీ, కరోలినా ప్లిస్కోవా, నవోమి ఒసాకాతో కలిసి బరిలోకి దిగాల్సి ఉంది. అయితే, "దురదృష్టవశాత్తు శిక్షణలో గాయపడటంతో ఈ సీజన్‌ తొలి టోర్నీ అయిన బ్రిస్బేన్‌లో ఆడలేకపోతున్నాను" అని వీనస్‌ విలియమ్స్ బుధవారం పేర్కొంది.

ఆమె స్థానంలో మరొకరిని వైల్డ్ కార్డు ద్వారా ఎంపిక చేయనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. ఇదిలా ఉంటే, జనవరి 13న మొదలయ్యే అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో వీనస్‌ విలియన్స్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Thursday, January 2, 2020, 11:57 [IST]
Other articles published on Jan 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+