హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ పోరు ముగిసింది. సెమీస్‌లో మరో అమెరికా క్రీడాకారిణి స్లోని స్టీఫెన్స్ షాక్ ఇవ్వడంతో వీనస్ ఇంటిదారి పట్టింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా జరిగిన తొలి సెమీస్‌లో 83వ ర్యాంక్ ప్లేయర్ స్టీఫెన్స్ 6-1, 0-6, 7-5 తేడాతో వీనస్‌పై విజయం సాధించింది.
తొలి సెట్‌లో వెనుకబడిన వీనస్ విలియమ్స్ ఆ తర్వాత అనూహ్యంగా పుంచుకుని రెండో సెట్‌ను సాధించింది. ఇక నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో హోరాహోరీగా సాగింది. ఈ సెట్‌ను వీనస్ తృటిలో కోల్పోయింది. దీంతో సెమీస్‌లో 1-6, 6-0, 5-7తో స్టీఫెన్స్ చేతిలో వీనస్ ఓటమి పాలైంది.
ఇక రెండో సెమీస్‌లో 15వ ర్యాంక్ అమెరికా క్రీడాకారిణి కీస్ 6-1, 6-2 స్కోర్ తేడాతో అదే దేశానికి చెందిన వాండవేగ్‌పై విజయం సాధించింది. దీంతో శనివారం జరిగే ఫైనల్లో స్టీఫెన్స్‌తో కీస్ తలపడనుంది. 2002 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఇద్దరు అమెరికన్ ప్లేయర్లు పోటీపడడం ఇది తొలిసారి.