న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యుఎస్ ఓపెన్: వీనస్ సర్వ్ దెబ్బకు బాల్ బాయ్ విలవిల (వీడియో)

By Nageshwara Rao

హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శనివారం మహిళల సింగిల్స్‌లో భాగంగా వీనస్ విలియమ్స్, మారియా సక్కారిల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ మూడ‌ో రౌండ్‌లో వీన‌స్ విలియ‌మ్స్ చేసిన ప‌వ‌ర్‌ఫుల్ స‌ర్వ్‌కు ఓ బాల్ బాయ్ విలవిలలాడాడు.

మ్యాచ్‌లో భాగంగా వీన‌స్ విలియమ్స్ 129 కిలోమీట‌ర్ల వేగంతో స‌ర్వ్ చేసింది. ఆ స‌ర్వ్‌కు రిట‌ర్న్ ఇచ్చేందుకు ప్ర‌త్య‌ర్థి మారియా సక్కారి కూడా ప్ర‌య‌త్నించ లేదు. దీంతో ఆ బాల్ నేరుగా బాల్ బాయ్ ద‌గ్గ‌రికి వెళ్లింది. కానీ ఆ బాల్ బాయ్ అంత ప‌వ‌ర్‌ఫుల్ స‌ర్వ్‌ను ప‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయ్యాడు.

దీంతో బంతి నేరుగా అత‌ని ప్రైవేట్ భాగాల‌కు త‌గిలింది. అతడు ఓ నిమిషం పాటు టెన్ష‌న్‌తో విల‌విల‌లాడు. బ‌లంగా వ‌చ్చిన బంతి వృష‌ణాల‌కు తాక‌డంతో బాల్ బాయ్ కొద్దిసేపటి వరకు తేరుకోలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో వీన‌స్ త‌న ప్ర‌త్య‌ర్థి మారియాపై 6-3, 6-4 స్కోర్‌తో గెలిచింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X