Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెరెనాకు చెమటలు పట్టించిన టీనేజర్‌.. మూడో రౌండ్‌కు ఫెదరర్‌, జకోవిచ్‌

US Open: Serena Williams beats teenager Caty McNally, Federer and Djokovic enters 3rd round

న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ రసవత్తరంగా సాగుతోంది. మహిళల సింగిల్స్‌లో మూడో రౌండ్‌ చేరేందుకు అమెరికా స్టార్, ఎనిమిదో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ కష్టపడింది. వైల్డ్‌కార్డ్‌తో టోర్నీలో అడుగుపెట్టిన 17 ఏళ్ల అమెరికా టీనేజర్‌ క్యాటీ మెక్‌నాలీ సెరెనాకు ముచ్చెమటలు పట్టించింది. తొలి సెట్‌ గెలుచుకొని సంచలనం సృష్టించేలా కనిపించిన క్యాటీ.. సెరీనా అనుభవం ముందు తేలిపోయింది. చివరకు సెరెనా 5-7, 6-3, 6-1 స్కోరుతో మెక్‌నాలీపై విజయం సాధించి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది.

టాప్‌సీడ్‌ నవోమి ఒసాక, రెండోసీడ్‌ ఆష్లే బార్తీ, 10వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. ఒసాక రెండో రౌండ్లో 6-2, 6-4తో లినెట్‌ (పోలెండ్‌)పై.. బార్టీ (ఆస్ట్రేలియా) 6-2, 7-6 (7-2)తో లారెన్‌ డేవిస్‌ (అమెరికా)పై విజయం సాధించారు. మూడో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌) 6-1, 6-4తో బోల్క్‌వాజె (జార్జియా)ను ఓడించింది. కీస్‌ (అమెరికా) 6-4, 6-1 స్కోరుతో జు లిన్‌ (చైనా)ను చిత్తూ చేసింది. అయితే ఆరో సీడ్‌ క్విటోవా (చెక్‌) 4-6, 4-6తో పెట్కోవిచ్‌ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. వీనస్‌ విలియమ్స్‌ 4-6, 4-6తో ఐదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) చేతిలో పరాజయంపాలైంది.

పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో స్టార్‌ ప్లేయర్లు డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా), స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌, నిషికొరి (జపాన్‌) విజయం సాధించి ముందడుగేశారు. జకోవిచ్‌ 6-4, 7-6 (7-3), 6-1తో లొండెరో (అర్జెంటీనా)ను మట్టికరిపించాడు. ఫెదరర్‌ 3-6, 6-2, 6-3, 6-4తో జుముర్‌ (బోస్నియా)పై విజయం సాధించాడు. నిషికోరి 6-2, 4-6, 6-3, 7-5తో క్లాన్‌ (అమెరికా)పై నెగ్గగా.. కోరిచ్‌ (క్రొయేషియా) నుంచి దిమిత్రోవ్‌కు వాకోవర్‌ లభించింది.

Story first published: Friday, August 30, 2019, 13:55 [IST]
Other articles published on Aug 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+