
సానియా జోడీ
యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్‌లో బ్రెజిల్ ఆటగాడు బ్రూనో సొయెర్స్ భాగస్వామిగా ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టైటిల్ సాధించింది.

సానియా జోడీ
శుక్రవార మిక్కడ జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-బ్రూనో ద్వయం 6-1, 2-6, 11-9తో స్పియర్స్ (అమెరికా)-గొంజాలెజ్ (మెక్సికో) ద్వయంపై టై బ్రేక్‌లో ఉత్కంఠ విజయం సాధించింది.

సానియా జోడీ
ఇరువురూ చెరో సెట్ గెలుచుకోవడంతో మ్యాచ్ టై బ్రేక్‌కు దారితీసింది. ఉత్కంఠగా సాగిన టై బ్రేక్‌లో సానియా జోడీ 11-9తో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. బ్రూనోతో జోడీకట్టడం సానియాకిదే తొలిసారి కావడం విశేషం.

సానియా జోడీ
ఇక ఆస్త్రేలియా ఓపెన్‌లోనూ బ్రూనోతో కలిసి ఆడుతానని మ్యాచ్ ముగిసిన అనంతరం సానియా ప్రకటించింది. మహేష్ భూపతితో కలిసి సానియా 2009లో ఆస్ట్రేలియా ఓపెన్, 2012లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గింది.

సానియా జోడీ
మహిళల డబుల్స్‌లో మూడో సీడ్ సానియా-కారా బ్లాక్ జోడీ ఫైనల్‌కు ముందే నిష్క్రమించింది. గురువారం రాత్రి జరిగిన సెమీస్‌లో సానియా జోడీ 2-6, 4-6తో వరుస సెట్లలో అన్‌సీడెడ్ మార్టినా హింగిస్ స్విట్జర్లాండ్)-ప్లావియా పెనెట్టా (ఇటలీ) ద్వయం చేతిలో ఓటమి పాలైంది.


Click it and Unblock the Notifications











