
ఫ్యాన్‌తో కలిసి కోర్టులో జకోవిచ్ డ్యాన్స్
యుఎస్ ఓపెన్ రెండో రౌండ్‌లో నోవాక్ జకోవిచ్, ఆండ్రియస్ హైదర్‌ల మ్యాచ్ ముగియగానే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీవీ యాంకర్‌తో మాట్లాడుతున్న జకోవిచ్ స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమానిని కోర్టులోకి రమ్మని పిలిచాడు. వెంటనే అతడు కోర్టులోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు.

ఫ్యాన్‌తో కలిసి కోర్టులో జకోవిచ్ డ్యాన్స్
ఇద్దరూ కలిసి కాసేపు కోర్టులోనే కుప్పిగంతులు వేస్తున్నట్లుగా ఓ సరికొత్త రకం డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత 'ఐ లవ్ న్యూయార్క్' అని రాసున్న టీ షర్ట్‌ను జకోవిచ్‌కు ఆ అభిమాని తొడిగేశాడు.

ఫ్యాన్‌తో కలిసి కోర్టులో జకోవిచ్ డ్యాన్స్
దీంతో కోర్టులో ఉన్న చాలా మందికి ఈ సంఘటన కొత్తగా అనిపించింది. అయితే వీరిద్దరికి ఇది కొత్త కాదు. 2011లోనూ జకోవిచ్, అతను కలిసి ఇలాగే డ్యాన్స్ చేశారు.

ఫ్యాన్‌తో కలిసి కోర్టులో జకోవిచ్ డ్యాన్స్
ఆ అభిమాని పేరు కామెరూన్ హ్యూస్. 'సూపర్ ఫ్యాన్'గా అతడు అమెరికావాసులకు సుపరిచితుడు. హాకీ, బాస్కెట్ బాల్ ఇలా ఏ పోటీ జరుగుతున్నా, తన కుప్పిగంతుల డ్యాన్స్‌తో మైదానాల్లో అదరగొడుతుంటాడు.


Click it and Unblock the Notifications











