Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open: సంచలనం.. రెండో రౌండ్‌లోనే అల్కరాస్ ఓటమి

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాస్ మూడో రౌండ్‌కు చేరుకోలేకపోయాడు. రెండో రౌండ్‌లో నెదర్లాండ్స్ ప్లేయర్, 74వ ర్యాంకర్ అయిన బొటిక్ వాన్‌డి చేతిలో ఓటమి పాలయ్యాడు. 1-6, 5-7, 4-6 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశాడు. 2021 వింబుల్డన్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అతి త్వరగా నిష్క్రమించడం అల్కరాజ్‌కు ఇదే తొలిసారి. 2021 వింబుల్డన్‌లోనూ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు.

ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో అల్కరాస్ రజతం సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్‌ చేతిలో ఓటమిపాలై సిల్వర్‌ సాధించాడు. అయితే ఈ సీజన్‌లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్‌లలో టైటిల్ సాధించాడు. కాగా, యూఎస్ ఓపెన్‌లోనూ గెలిచి.. ఓ సీజన్‌లో ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లు గెలిచిన మూడో ప్లేయర్‌గా రికార్డు సాధించాలనుకున్న అతని ఆశలకు బొటిక్ బ్రేక్‌లు వేశాడు.

US Open Carlos Alcaraz Upset in Second Round by Unseeded Botic van de Zandschulp

''నాకు మాటలు రావడం లేదు. ఈ సాయంత్రం ఎంతో గొప్పగా సాగింది. ఇవాళ మొదటి పాయింట్ నుంచి నేను పైచేయి సాధిస్తాననే నమ్మకం కలిగింది. కాస్త ఆందోళనకు గురయ్యాను. కానీ ఇలాంటి ఆటగాళ్లను ఓడించాలంటే ప్రశాంతతో ఉంటూ ఆటపై ఫోకస్ చేయాలి'' అని అన్‌సీడెడ్ బొటిక్ పేర్కొన్నాడు.

మరోవైపు ప్రపంచ నంబర్ వన్ జానెక్ సినర్, డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్, నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎనిమిదో సీడ్ కార్పస్ రూడ్ కూడా మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. ఇక మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కొకోగాఫ్‌; సబలెంకా, స్వితోలినా, బదోసా, జెంగ్‌ కూడా రెండో రౌండ్‌ను దాటారు. అయితే నవోమి ఒసాకా పరాజయాన్ని చవిచూసింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన కరోలినా ఒసాకాపై 6-3, 7-6 (7/5) తేడాతో గెలిచింది.

Story first published: Friday, August 30, 2024, 11:48 [IST]
Other articles published on Aug 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+