Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open: వరల్డ్ నంబర్ వన్‌‌‌కు చుక్కెదురు

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌-2024 సంచలనాలకు వేదికగా మారింది. వరల్డ్ నంబర్ వన్ ఇగా స్వైటెక్‌ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. ఈ పోలెండ్ స్టార్ అమెరికా ప్లేయర్, ఆరో ర్యాంకర్ జెస్సికా పెగులా చేతిలో 2-6, 4-6 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సీజన్‌లో జరుగుతున్న ఈ ఆఖరి గ్రాండ్‌స్లామ్‌లో స్టార్ ప్లేయర్లు అనూహ్యంగా నిష్క్రమించడం ఇదే తొలిసారి కాదు.

డిఫెండింగ్ ఛాంపియన్ కొకో గాఫ్‌, అయిదో సీడ్ జాస్మిన్ పౌలీని ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. ఇక మెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్, ఒలింపిక్స్ రజత పతక విజేత కార్లో స్ అల్కరాజ్ కూడా నాకౌటైన విషయం తెలిసిందే. అయితే స్వైటెక్‌‌తో జరిగిన పోరులో జెస్సికా ఆధిపత్యం చెలాయించింది. రెండో సెట్‌లో స్వైటెక్‌ ప్రతిఘటించినా జెస్సికా గొప్పగా మ్యాచ్‌ను ముగించి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

US Open 2024 World No 1 Iga Swiatek Upset by Jessica Pegula

మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ సబలెంక (బెలారస్‌), ముకోవా (చెక్ రిపబ్లిక్), ఎమ్మా నవారో (అమెరికా) సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. సెమీస్‌లో నవారో-సబలెంక, జెస్సికా-ముకోవా పోటీపడనున్నారు. కాగా, జెస్సికాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్‌.

పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో అమెరికా చెందిన టేలర్ ఫ్రిట్స్, ఫ్రాన్సిస్ టియాఫో పోటీపడుతున్నారు. మరో సెమీస్‌లో ఇటలీ స్టార్ ప్లేయర్ సినర్, బ్రిటన్ ఆటగాడు జాక్ డ్రేపర్ తలపడనున్నారు. ఇవాళ జరిగిన క్వార్టర్స్‌‌లో మెద్వెదెవ్‌ (రష్యా)పై సినర్ 6-2, 1-6, 6-1, 6-4తో విజయం సాధించాడు.

Story first published: Thursday, September 5, 2024, 13:26 [IST]
Other articles published on Sep 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+