Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open 2024: టైటిల్ గెలిచిన సినర్‌

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీ స్టార్, ప్రపంచ నంబర్ వన్ జానిక్ సినర్ నిలిచాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన తుదిపోరులో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై 6-3, 6-4, 7-5 తేడాతో విజయం సాధించాడు. ఈ సీజన్‌లో టాప్ సీడ్ సినర్‌కు ఇది రెండో టైటిల్. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతను ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

రెండు గంటల 16 నిమిషాల పాటు సాగిన తుది పోరులో సినర్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు. తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్‌ ఆడుతున్న ఫ్రిట్జ్‌పై విరుచుకుపడ్డాడు. వరుసగా మూడు సెట్లను గెలిచి టైటిల్ అందుకున్నాడు. దీంతో రెండు దశాబ్దాల నుంచి యూఎస్ ఓపెన్ టైటిల్ కోసం ఎదురు చూస్తున్న అమెరికన్ల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది.

US Open 2024 Jannik Sinner Crushes Taylor Fritz to Clinch Singles Crown

గత 15 ఏళ్లలో గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్స్‌కు చేరిన తొలి అమెరికా ప్లేయర్‌గా ఫ్రిట్స్ అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫ్రిట్జ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2003 తర్వాత యూఎస్ ఓపెన్‌లో మెన్స్ సింగిల్స్ గెలిచిన మొదటి అమెరికా ప్లేయర్‌గా అతను చరిత్ర సృష్టిస్తాడని భావించారంతా. కానీ ఫ్రిట్జ్ ఆశలను సినర్ ఆవిరి చేశాడు. కాగా, యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి ఇటలీ ప్లేయర్‌గా సినర్ చరిత్రకెక్కాడు.

మరోవైపు మహిళల డబుల్స్‌ టైటిల్‌ను ఒస్టాపెంకో (లాత్వియా)-కిచెంక్‌ (ఉక్రెయిన్‌) జంట గెలిచింది. ఫైనల్లో ఒస్టాపెంకో-కిచెంక్ జోడి మ్లదనోవిచ్‌ (ఫ్రాన్స్‌)-జెంగ్‌ (చైనా) ద్వయంపై 6-4, 6-3తో నెగ్గింది. ఇక మహిళ సింగిల్స్‌లో బెలారస్ స్టార్ అర్యానా సబలెంక విజేతగా నిలిచింది. ఫైనల్‌లో అమెరికా ప్లేయర్ జెస్సికా పెగులా‌పై 7-5, 7-5తో వరుస సెట్లను గెలిచింది. 26 ఏళ్ల సబలెంకకు ఇది మొదటి యూఎస్ ఓపెన్ టైటిల్. కెరీర్‌లో ఓవరాల్‌‌గా మూడో గ్రాండ్ స్లామ్. 2023, 2024 సీజన్లలో ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలిచింది.

Story first published: Monday, September 9, 2024, 9:21 [IST]
Other articles published on Sep 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+