Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open: సినర్ అలవోకగా మూడో రౌండ్‌కు

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్ వన్ జానెక్ సినర్ అలవోకగా మూడో రౌండ్‌కు చేరాడు. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్, నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎనిమిదో సీడ్ కార్పస్ రూడ్ కూడా మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. ఇక మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కొకోగాఫ్‌; సబలెంకా, స్వితోలినా, బదోసా, జెంగ్‌ కూడా రెండో రౌండ్‌ను దాటారు.

పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో అమెరికా ప్లేయర్ మిచెల్‌‌సన్‌పై ఇటలీ కుర్రాడు సినర్ 6-4, 6-0, 6-2తో విజయం సాధించాడు. సినర్‌కు తొలి సెట్‌లోనే కాస్త పోటీ ఎదురైంది. ఆ తర్వాత సినర్‌దే పూర్తి ఆధిపత్యం. ఇక సెర్బియా దిగ్గజం జకోవిచ్‌.. ప్రత్యర్థి లాస్లో జైర్‌ (సెర్బియా)‌పై తొలి రెండు సెట్‌లు 6-4, 6-2తో గెలిచాడు. అయితే మూడో సెట్‌లో2-0తో జకో ఆధిక్యంలో ఉన్న సమయంలో జైర్ గాయం కారణంగా తప్పుకున్నాడు.

US Open 2024 Jannik Sinner Advances to Third Round

ఇక జ్వెరెవ్‌ 6-4, 7-6 (7-5), 6-1తో ములర్‌ (ఫ్రాన్స్‌)పై; రూడ్‌ (నార్వే) 6-4, 6-2, 2-6, 7-6 (7-3)తో మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై; థాంప్సన్‌ (ఆస్ట్రేలియా) 7-6 (7-2), 6-1, 7-5తో హర్కాజ్‌ (పోలెండ్‌)పై గెలిచాడు.టియాఫో (అమెరికా), ఫ్రిట్జ్‌ (అమెరికా), దిమిత్రోవ్‌ (బల్గేరియా), రుబ్లెవ్‌ (రష్యా) కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు.

ఇక మహిళల సింగిల్స్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ కొకోగాఫ్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. జర్మనీ ప్లేయర్ టట్‌జానా మరియాపై 6-4, 6-0తో ఘనంగా నెగ్గింది. అయితే తొలి సెట్‌లో గాఫ్ కాస్త తడబడింది. అనవసరం తప్పిదాలు చేసి ప్రత్యర్థికి అవకాశాలు ఇచ్చింది. కానీ ఆ తర్వాత పుంజుకుని సెట్ గెలిచింది. 80 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గాఫ్ ప్రత్యర్థి సర్వీస్‌ను అయిదు సార్లు బ్రేక్ చేసింది.

మరోవైపు సబలెంకా (బెలారస్) 6-3, 6-1తో లూసియా (ఇటలీ)పై; అజరెంకా (బెలారస్) 6-1, 6-4తో క్లారా బురెల్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. కాగా, వింబుల్డన్‌ ఛాంపియన్ బార్బారా క్రెజికోవా (చెక్‌)కు ఇంటిముఖం పట్టింది. రొమేనియా ప్లేయర్ ఎలీనా రూజ్ చేతిలో 4-6, 5-7తో ఓటమిపాలైంది.

Story first published: Friday, August 30, 2024, 10:00 [IST]
Other articles published on Aug 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+