యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆసక్తికరంగా సాగుతోంది. గత 18 ఏళ్లలో తొలిసారి ఓ అమెరికా ఆటగాడు ఈ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో అడుగుపెట్టనున్నాడు. అమెరికా చెందిన టేలర్ ఫ్రిట్స్, ఫ్రాన్సిస్ టియాఫో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. దీంతో ఓ అమెరికా ప్లేయర్ యూఎస్ ఓపెన్ తుదిపోరుకు అర్హత సాధించడం ఖాయం.
ఇక 2009 తర్వాత గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్స్‌కు ఓ అమెరికా ప్లేయర్ అర్హత సాధించడం కూడా ఇదే ప్రథమం కానుంది. 2009 వింబుల్డన్ టోర్నీలో ఆండీ రాడిక్ ఫైనల్స్ ఆడాడు. ఆ తర్వాత అగ్రరాజ్యం నుంచి ఏ ప్లేయర్ పురుషుల సింగిల్స్‌లో టైటిల్ పోరుకు చేరలేకపోవడం గమనార్హం. కాగా, క్వార్టర్ ఫైనల్స్‌లో జర్మనీ స్టార్ జ్వెరెవ్‌ను 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ 7-6 (7-2), 3-6, 6-4, 7-6 (7-3)తో ఓడించాడు. ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఫ్రిట్జ్ సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి.

ఇక మరో క్వార్టర్స్‌లో బల్గేరియా ప్లేయర్ దిమిత్రోవ్ గాయం నుంచి తప్పుకున్నాడు. 20వ సీడ్ టియాఫో 6-3, 6-7 (5-7), 6-3, 4-1తో ఆధిక్యంతో ఉన్న సమయంలో దిమిత్రోవ్ గాయంతో రిటైరయ్యాడు. దీంతో సెమీస్‌లో అమెరికా ప్లేయర్లు ఫ్రిట్స్ టియాఫో తలపడనున్నారు. హెడ్ టూ హెడ్ రికార్డుల పరంగా టియాఫోపై ఫ్రిట్జ్‌దే (6-1) పైచేయి. పురుషుల సింగిల్స్‌లో 2003లో ఆండీ రాడిక్ విజయం తర్వాత ఏ అమెరికా ప్లేయర్ యూఎస్ ఓపెన్ టైటిల్ గెలవలేదు.
ఇతర క్వార్టర్స్‌లో బ్రిటన్ ప్లేయర్ డ్రేపర్ విజయం సాధించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డిమాన్వర్‌ను 6-3, 7-5, 6-2తో ఓడించారు. మరో క్వార్టర్ ఫైనల్స్‌లో సినర్ (ఇటలీ) X మెద్వెదెవ్ (రష్యా) తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంక (బెలారస్), ముకోవా (చెక్ రిపబ్లిక్) సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు.