Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open: కొకో గాఫ్ ఔట్

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌‌లో సంచలనాలు నమోదువుతూనే ఉన్నాయి. స్లార్ ప్లేయర్లు ఇంటిముఖం పడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కొకో గాఫ్‌ పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. అలాగే అయిదో సీడ్ జాస్మిన్ పౌలీని కూడా నిష్క్రమించింది. ఇప్పటికే మెన్స్ సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్, ఒలింపిక్స్ రజత పతక విజేత కార్లో స్ అల్కరాజ్ కూడా నాకౌటైన విషయం తెలిసిందే.

కాగా, అమెరికా స్టార్ ప్లేయర్ కొకో గాఫ్‌కు తన దేశానికే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారో షాకిచ్చింది. 2 గంటల 12 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6-4, 4-6, 6-3తో ఓడించింది. అయితే కొకో గాఫ్ ఏకంగా 19 డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం. 60 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మరోవైపు ఇటలీ స్టార్ పౌలీని చెక్ రిపబ్లిక్ ప్లేయర్ కరోలినా ముచోవా 6-3, 6-3తో మట్టికరిపించింది.

US Open 2024 Defending Champion Coco Gauff Upset by Emma Navarro

ఇక రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్), ఏడో సీడ్ కిన్‌వెన్ జెంగ్ (చైనా) క్వార్టర్స్‌కు చేరుకుంది. డోనా వెకిచ్ (క్రొయేషియా)పై కిన్‌వెన్ 7-6 (7/2), 4-6, 6-2తో గెలిచింది. ఎలీజ్ మెర్‌టెన్స్ (బెల్జియం)పై 6-2, 6-4తో సబలెంకా విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్‌ రుబ్లెవ్, ఎనిమిదో సీడ్‌ రూడ్‌ల పోరాటానికి తెరపడింది.

జ్వెరెవ్, ఫ్రిట్జ్, దిమిత్రోవ్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లారు. రుబ్లెవ్‌ (రష్యా)ను 6-3, 7-6 (7-3), 1-6, 3-6, 6-3తో దిమిత్రోవ్‌ (బల్గేరియా) ఓడించాడు. రూడ్‌ (నార్వే)పై 12వ సీడ్‌ ఫ్రిట్జ్‌ 3-6, 6-4, 6-3, 6-2తో గెలిచాడు. ఇక పురుషుల డబుల్స్‌ మూడో రౌండ్‌లో రోహన్ బోపన్న-ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ ఓటమిపాలైంది. అర్జెంటీనా ద్వయం గొంజాలెజ్‌- మొల్తెని చేతిలో 1-6, 5-7తో పరాజయాన్ని చవిచూసింది.

Story first published: Tuesday, September 3, 2024, 9:22 [IST]
Other articles published on Sep 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+