Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open 2023: ప్రపంచ నాలుగో ర్యాంకర్‌కు షాక్.. యూఎస్ ఓపెన్ నుంచి అవుట్!

యూఎస్ ఓపెన్‌లో సంచలన విజయం నమోదైంది. ఎవరూ ఊహించని విధంగా ప్రపంచ నాలుగో ర్యాంకర్ హోల్గర్ రూన్‌ ఓటమి పాలయ్యాడు. స్పెయిన్ ప్లేయర్ కార్బాలెస్ బేనా చేతిలో రూన్ మట్టికరిచాడు. ఎవరూ ఊహించని విధంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి రౌండ్‌లోనే బేనా 6-3తో పైచేయి సాధించాడు. ఆ తర్వాత రెండో రౌండ్‌లో రూన్ 4-6తో తేరుకున్నాడు. కానీ చివరి రెండు రౌండ్లలో 4-3, 4-2తో రూన్‌ను చిత్తు చేసిన బేనా చరిత్ర సృష్టించాడు.

పురుషుల సింగిల్స్ విభాగంలో జరిగిన ఈ మ్యాచ్ రెండు గంటల 42 నిమిషాల పాటు సాగడం గమనార్హం. అంతేకాదు, ఏటీపీ సర్క్యూట్‌లో టాప్‌ టెన్‌లో ఉన్న ప్లేయర్‌ను ఓడించడం బేనా కెరీర్‌లో ఇదే తొలిసారి కూడా. అత్యంత ట్యాలెంటెడ్ ప్లేయర్లలో ఒకడిగా పేరున్న రూన్.. ఈ మ్యాచ్‌లో చాలా పేలవంగా ఆడాడు. ఏకంగా 43 తప్పిదాలు చేశాడు. దీని వల్లనే అతను ఓడిపోయాడన్నా కూడా ఆశ్చర్యం లేదు.

US Open 2023 World number four Holgar Rune faces defeat

గతేడాది స్టార్ ప్లేయర్ రఫేల్ నాదెల్‌ను ఓడించి గుర్తింపు పిందిన ఫ్రాన్సెస్ టియాఫో ఈ ఏడాది కూడా యూఎస్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. అతను లెర్నర్ టీన్‌ను 6-2, 7-5, 6-1 తేడాతో వరుస సెట్లలో ఓడించాడు. రెండు గంటల 8 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. ఘనవిజయంతో రెండో రౌండ్‌లో అడుగు పెట్టిన టియాఫో.. ఈ రౌండ్‌లో సెబాస్టియన్ ఆఫ్నర్‌ను ఎదుర్కొంటాడు.

ఇక మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్ ఇగా స్వియటెక్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన పోలెండ్ స్టార్ స్వియటెక్‌.. స్వీడన్‌కు చెందిన అన్‌సీడెడ్‌ రెబెక్కా పీటర్సన్‌‌ను 6-0, 6-1 తేడాతో సునాయాసంగా ఓడించింది. తాజాగా స్లోనే స్టెఫాన్స్‌ను బీట్రిజ్ హదాద్ 6-2, 5-7, 6-4 తేడాతో ఓడించి రెండో రౌండ్‌లో అడుగు పెట్టింది.

Story first published: Tuesday, August 29, 2023, 8:32 [IST]
Other articles published on Aug 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+