US Open 2023: మరో సంచలనం.. స్వియటెక్‌కు దిమ్మతిరిగే షాక్.. కొత్త క్వీన్ సబలెంక!
యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం నమోదైంది. మహిళల టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్ వన్, పోలండ్ స్టార్ ఇగా స్వియటెక్ తన కిరీటం కోల్పోయింది. యూఎస్ ఓపెన్‌లో జెలెనా ఓస్టాపెంకో చేతిలో వరుస సెట్లలో ఓడిన ఆమె.. ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు కోల్పోయింది. ఈ ర్యాంకును బెలారస్ టెన్నిస్ క్వీన్ అరీనా సబలెంక సొంతం చేసుకుంది. ఇలా అగ్రస్థానం కోల్పోయినందుకు స్వియటెక్ చాలా బాధ పడుతున్నట్లు తెలిపింది.
యూఎస్ ఓపెన్‌లో రౌండ్ ఆఫ్ 16లో జెలెనా, స్వియటెక్ తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో మంచి జోరు మీద కనిపించిన స్వియటెక్ 3-6 తేడాతో తొలి సెట్ తన ఖాతాలో వేసుకుంది. కానీ ఆ తర్వాత రెండు సెట్లను 6-3, 6-1 తేడాతో జెలెనా నెగ్గింది. ఇలా వరుసగా రెండు సెట్లు కోల్పోయిన స్వియటెక్.. మ్యాచ్ ఓడింది. ఈ ఓటమితో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు కూడా కోల్పోయింది.

ఆ ర్యాంకు తనకు చాలా గొప్పదని, అది కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని స్వియటెక్ చెప్పింది. అలాగే త్వరలోనే మరింత బలంగా తిరిగొస్తానని హామీ ఇచ్చింది. అదే సమయంలో మరో స్టార్ కరోలిన్ వోజ్నియాకిని యూఎస్ సంచలనం కోకో గాఫ్ చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌లో 6-3, 3-6, 6-1 తేడాతో కోకో తన ఖాతాలో వేసుకొని ముందంజ వేసింది. ఈ విజయంతో క్వార్టర్ ఫైనల్స్ చేరింది.
క్వార్టర్స్‌లో స్వియటెక్‌ను ఓడించిన జెలెనాను కోకో గాఫ్ ఢీకొట్టనుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్ జొకోవిక్ ముందడుగు వేశాడు. క్రొయేషిన్ ప్లేయర్ బోర్నా గోజోపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన జొకో 6-2, 7-5, 6-4 తేడాతో విజయం సాధించాడు. అతనితోపాటు 10వ సీడ్ టియాఫో, 9వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ కూడా ముందంజ వేశారు. క్వార్టర్స్‌లో ఫ్రిట్జ్, జొకోవిక్ తలపడతారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications