Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open 2023: వరల్డ్ నెంబర్ వన్ అల్కారెజ్ అవుట్.. టైటిల్ కాపాడుకోలేకపోయిన స్పెయిన్ స్టార్!

ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కారెజ్ కూడా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. సెమీఫైనల్ వరకు దూసుకొచ్చిన అతను.. కీలకమైన మ్యాచ్‌లో మెద్వెదేవ్ చేతిలో ఓటమి చవిచూశాడు. సెమీస్ ఓటమితో ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ టోర్నీలో అడుగు పెట్టిన అల్కారెజ్ పోరాటం ముగిసింది.

సెమీస్ వరకు అద్భుతమైన ఆటతీరుతో దూసుకొచ్చిన అల్కారెజ్.. రికార్డులు బద్దులు కొడుతూ టైటిల్ డిఫెండ్ చేసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ మెద్వెదేవ్ ఎగ్రెసివ్ ప్లే ముందు అతను నిలవలేకపోయాడు. మొదటి రెండు సెట్లలో మెద్వెదేవ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఈ రెండు సెట్లలతో తన ఫస్ట్ సర్వ్‌లలో మెద్వెదేవ్ 88 శాతం సక్సెస్ సాధించాడు.

US Open 2023:

దీంతో అల్కారెజ్‌పై ఒత్తిడి తీవ్రమైంది. బ్రేక్ పాయింట్లు సాధించడంలో కూడా అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో ఈ మ్యాచ్‌లో మెద్వెదేవ్ 7-6 (3), 6-1, 3-6, 6-3 తేడాతో విజయం సాధించాడు. కేవలం మొదటి, మూడో సెట్‌లో మాత్రమే అల్కారెజ్ గట్టి పోటీ ఇచ్చాడు. మూడో సెట్‌లో గెలిచాడు. కానీ మిగతా రెండు సెట్లలో అతనికి మెద్వెదేవ్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి విజయం సాధించిన మెద్వెదేవ్.. ఫైనల్‌లో జొకోవిక్‌తో తలపడతాడు. ఇక ఈ మ్యాచ్ ఓడిన అల్కారెజ్.. తన నెంబర్ వన్ ర్యాంకు కూడా కోల్పోనున్నాడు. ఈ క్రమంలో తన ఓటమి గురించి మాట్లాడిన ఈ స్పెయిన్ స్టార్.. తనకు ఇలాంటి మ్యాచులు హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ లేదని అన్నాడు. ఆటలో సమస్యలు వస్తే.. సొల్యూషన్స్ వెతకడంలో తను దిట్ట అనే ఫీలింగ్ ఈ మ్యాచ్‌తో పోయిందన్నాడు.

ఈ ఓటమి అనంతరం మాట్లాడిన అల్కారెజ్.. 'మెద్వెదేవ్ అద్భుతంగా ఆడాడు. నా దగ్గర ఆ ఆటకు జవాబు లేకపోయింది. మ్యాచ్ గెలవడానికి ఎలాంటి సమస్యలు ఎదురైనా సమాధానాలు ఇవ్వగల ఆటగాళ్లలో నేను మెరుగైన వాడిని అని ఇంతకాలం అనుకున్నా. కానీ ఈ మ్యాచ్ తర్వాత నా మనసు మార్చుకుంటున్నా. ఇలాంటి మ్యాచులు హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ నాకు లేదు. కాబట్టి దీని నుంచి నేను నేర్చుకోవాలి' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, September 9, 2023, 21:28 [IST]
Other articles published on Sep 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+