For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2021: చెల్లి బాటలోనే అక్క: గ్రాండ్ స్లామ్ నుంచి సైడ్

US Open 2021: Venus Williams follows her sister Serena Williams to pull out of the Grand Slam

న్యూయార్క్: ఈ నెలాఖరున ప్రారంభం కాబోతోన్న ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ మెగా టోర్నమెంట్ కళ తప్పినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే టాప్ సీడ్స్ అందరూ ఈ గ్రాండ్ స్లామ్ రేసు నుంచి తప్పుకొన్నారు. రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్.. అదే బాటలో సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగారు. హ్యామ్‌స్ట్రింగ్ గాయం వల్ల సెరెనా తప్పుకొన్నారు. ఈ విషయాన్ని ఆమె కూడా నిర్ధారించారు. టీమ్ మెంబర్స్‌తో చర్చించిన తరువాతే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు.

వీనస్ వంతు..

వీనస్ వంతు..

సెరెనా విలియమ్స్ నుంచి ఈ స్టేట్‌మెంట్ వెలువడిన కొన్ని గంటల్లోనే టెన్నిస్ ప్రియులకు షాక్ కలిగించే సమాచారం బయటికి వచ్చింది. సెరెనా విలియమ్స్ అక్క అమెరికన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ కూడా యూఎస్ ఓపెన్‌ నుంచి తప్పుకొన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో మెసేజ్‌ను తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద పోస్ట్ చేశారు. చెల్లి సెరెనా విలియమ్స్ బాటలోనే ప్రయాణించారామె. ఈ ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ ఆడట్లేదంటూ ప్రకటించారు.

కాలి గాయంతో..

కాలి గాయంతో..

41 సంవత్సరాల వీనస్ విలియమ్స్ కొంతకాలంగా కాలి గాయంతో బాధపడుతున్నారు. యూఎస్ ఓపెన్‌లో ఆడాలనే బలమైన కోరికతో ఆమె గాయంతోనే రోజువారీ ట్రైనింగ్‌లో పాల్గొంటోన్నారు. యూఎస్ ఓపెన్ దగ్గరికొచ్చింది. ఇంకో నాలుగు రోజుల్లో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. అయినప్పటికీ.. కాలి గాయం ఇంకా ఇబ్బందులకు గురి చేస్తోండటం వల్లే వీనస్ విలియమ్స్ ఈ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

మళ్లీ రాకెట్ పట్టుకుంటా..

మళ్లీ రాకెట్ పట్టుకుంటా..

ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు వీనస్. యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ తన ఫేవరెట్ అని, ఈ టోర్నమెంట్‌తో తనకు కొన్ని మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నారు. మళ్లీ రాకెట్ పట్టుకుని, టెన్నిస్ కోర్టులో కనిపించడానికి కఠోరంగా శ్రమిస్తానని, వీలైనంత త్వరగా అభిమానుల ముందుకు వస్తానని అన్నారు. అది ఏ రోజు అనేది ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేశారు. పునరాగమనం కోసం అహర్నిశలు ప్రయత్నిస్తానని తన అభిమానులకు భరోసా ఇచ్చారు.

ఆరోగ్యం సహకరించట్లేదు..

ఆరోగ్యం సహకరించట్లేదు..

చికాగోలో ముగిసిన విమెన్స్ టెన్నిస్ అసోసియేషన 250 ఓపెన్‌లో సత్తా చాటడానికి తన సామర్థ్యం మేరకు ప్రయత్నించానని వీనస్ విలియమ్స్ పేర్కొన్నారు. అభిమానుల అంచనాలను అందుకోలేకపోయానని చెప్పారు. కొన్నిసార్లు తనకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతోన్నానని అన్నారు. ఈ సారి కూడా ఎలాంటి అద్భుతాలను చేయలేనని అన్నారు. అందుకే- కాలి గాయం కారణంగా ఇష్టమైన యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.

టాప్ సీడ్‌గా..

టాప్ సీడ్‌గా..

ఏడుసార్లు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న వీనస్ విలియమ్స్ ఒక దశలో సుదీర్ఘకాలం పాటు నంబర్ వన్‌గా కొనసాగారు. ఆమె చెల్లెలు సెరెనా విలియమ్స్ రాకతో వీనస్ దూకుడుకు కళ్లెం పడింది. వైల్డ్ కార్డ్‌తో వీనస్ విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో ఎంట్రీ ఇచ్చారు. గ్రాండ్‌స్లామ్ ప్రారంభానికి ముందే తప్పుకొన్నారు. కాలి గాయానికి చికిత్స తీసుకోవడాన్ని మరికొంతకాలం పాటు కొనసాగిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. సంపూర్ణ ఆరోగ్యంతో బౌన్స్ బ్యాక్ అవుతానని అభిమానులకు హామీ ఇచ్చారు.

సుదీర్ఘకాలం తరువాత..

తాము యూఎస్ ఓపెన్ ఆడట్లేదంటూ రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, డొమినిక్ థీమ్ ఇదివరకే ప్రకటించారు. విలియమ్స్ సిస్టర్స్ ఇద్దరూ ఓ గ్రాండ్ స్లామ్‌లో పాల్గొనకపోవడం 2003 తరువాత ఇదే తొలిసారి. అలాగే- పురుషుల విభాగంల రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్, మహిళల కేటగిరీలో సెరెనా విలియమ్స్ వీనస్ విలియమ్స్ ఆడకపోవడం 1997 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ తరువాత ఇదే తొలిసారి.

Story first published: Thursday, August 26, 2021, 13:48 [IST]
Other articles published on Aug 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+