Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open 2021: రాకెట్ విర‌గ్గొట్టి నానా హంగామా చేసిన జోకొవిచ్‌ (వీడియో)!!

US Open 2021 Final: Novak Djokovic smashed his racket in anger after defeated by Daniil Medvedev

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ 2021లో రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో ప్రపంచ నంబర్‌వన్‌, సెర్బియా స్టార్ నోవాక్‌ జకోవిచ్‌ను ఓడించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్‌లో మెద్వెదెవ్‌ 6-4, 6-4, 6-4 తేడాతో జకోను ఓడించాడు. వరుస సెట్లలో జకోను కంగుతినిపించి ఔరా అనిపించాడు. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు జకోవిచ్‌ ఇంకొన్ని రోజుల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.

యూఎస్‌ ఓపెన్‌ 2021 ఫైనల్ గెలిచి ఉంటే నొవాక్ జోకొవిచ్‌ టెన్నిస్‌లో మ‌రో చ‌రిత్ర సృష్టించేవాడు. అయితే ఓడిపోవడంతో 1969 త‌ర్వాత కేలండ‌ర్ స్లామ్ సాధించిన తొలి ప్లేయ‌ర్‌గా నిల‌వ‌డానికి, అత్య‌ధిక గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టించ‌డానికి అడుగు దూరంలో నిలిచిపోయాడు. యూఎస్ ఓపెన్ ఫైన‌ల్లో మెద్వెదెవ్ చేతుల్లో వ‌రుస సెట్ల‌లో ఓడిన జోకొవిచ్‌.. ఆ ఓట‌మిని త‌ట్టుకోలేక నానా హంగామా చేశాడు.

ఓట‌మి బాధ‌లో నొవాక్ జోకొవిచ్‌ త‌న రాకెట్‌ను విర‌గ్గొట్టాడు. మూడుసార్లు రాకెట్‌ను బలంగా నేలకేసి కొట్టాడు. దాంతో రాకెట్‌ విరిగిపోయింది. తృటిలో చ‌రిత్ర సృష్టించే అవ‌కాశాల‌న్ని చేజార్చుకోవ‌డంతో కంట‌త‌డి కూడా పెట్టాడు. అయితే ఇప్పుడు కాస్త ఉప‌శ‌మనంగా ఉంది.. అది జ‌రిగిపోయినందుకు సంతోషంగా ఉంది అని మ్యాచ్ త‌ర్వాత జోకొవిచ్ అన్నాడు. ఈ స‌మ‌యంలో న్యూయార్క్ అభిమానులు అత‌నికి అండ‌గా నిలిచారు. టోర్నీ మొత్తం తాను చాలా ఒత్తిడి అనుభ‌వించాన‌ని ఈ సంద‌ర్భంగా జకో చెప్పాడు. మొత్తానికి ఈ ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డినందుకు సంతోషంగా ఉన్నా.. అదే స‌మ‌యంలో అనుకున్న‌ది సాధించ‌నందుకు బాధ‌గా కూడా ఉన్న‌ద‌ని అన్నాడు.

నొవాక్ జోకొవిచ్‌ త‌న రాకెట్‌ను పగలగొట్టిన వీడియోను ఓ ట్విట్టర్ యూసర్ తన ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. ప్ర‌స్తుతం రోజర్ ఫెద‌ర‌ర్‌, రఫెల్ న‌డాల్‌తో క‌లిసి నొవాక్ జోకొవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సంయుక్తంగా టాప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ యూఎస్ ఓపెన్ గెలిచి ఉంటే.. ఆ ఇద్ద‌రు లెజెండ‌రీ ప్లేయ‌ర్స్‌ను అధిగ‌మించేవాడు. జకో ఓడిపోవడంతో మైదానంలోని అతడి ఫాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ అసహనం వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడారు.

ఉత్కంఠగా సాగిన ఈ తుది సమరంలో ప్రపంచ నంబర్‌ 2 ఆటగాడు మెద్వెదెవ్‌, జకోవిచ్‌ నువ్వానేనా అన్నట్లుగా ఆడారు. మెద్వెదెవ్‌ అద్భుత ఆటతో తొలి సెట్‌ను 6-4 తేడాతో గెలిచుకుని జకోవిచ్‌పై పైచేయి సాధించాడు. రెండో సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు బలమైన షాట్లు, సర్వీస్‌ బ్రేక్‌లతో విరుచుకుపడడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థితికి చేరింది. అయితే జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వని మెద్వెదెవ్‌ 6-4తో రెండో సెట్‌ను సైతం కైవసం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో జకో మొదట తేలిపోయినప్పటికీ.. తర్వాత పుంజుకున్నాడు. అయినప్పటికీ మెద్వెదెవ్‌ విజయాన్ని జకో అడ్డుకోలేపోయాడు.

Story first published: Monday, September 13, 2021, 11:54 [IST]
Other articles published on Sep 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+