న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open: గార్సియా సంచలన విజయం.. ప్లిస్కోవాకు షాక్‌!!

US Open 2020: Caroline Garcia packs off top seed Karolina Pliskova

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. చెక్‌ రిపబ్లిక్‌ స్టార్, టాప్‌సీడ్‌ కరోలినా ప్లిస్కోవా రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ప్రపంచ 50వ ర్యాంకర్‌ కరోలినా గార్సియా 6-1, 7-6 (7/2) తేడాతో ప్లిస్కోవాపై సంచలన విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే గార్సియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి.. ప్లిస్కోవాను అనామక క్రీడాకారిణిగా మార్చేస్తూ వరుస గేమ్‌లు గెలుచుకుంది.

గార్సియా వేగవంతమైన సర్వీస్‌లు, బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో పాయింట్లు సాధించింది. చూస్తుండగానే 5-0తో దూసుకెళ్లింది. ఆ తర్వాత ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ప్లిస్కోవా ఓ గేమ్‌ గెలిచినప్పటికీ.. తిరిగి బలమైన షాట్లతో చెలరేగిన గార్సియా తర్వాతి గేమ్‌ గెలుచుకుని సెట్‌ సొంతం చేసుకుంది. రెండో సెట్‌లోనూ జోరు కొనసాగించిన ఆమె ఓ దశలో 4-2తో విజయం దిశగా సాగింది. ఆ దశలో పుంజుకున్న ప్లిస్కోవా.. వరుసగా మూడు గేమ్‌లు గెలిచి ఆధిక్యం సంపాదించింది. కానీ గార్సియా పోరాడి 6-6తో స్కోరు సమం చేసింది. టైబ్రేకర్‌లో చెలరేగిన గార్సియా మ్యాచ్‌ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గార్సియా మూడు ఏస్‌లు, 30 విన్నర్లు కొట్టింది.

పదో సీడ్‌ ముగురుజ (స్పెయిన్‌) కూడా రెండో రౌండ్లోనే ఓడిపోయింది. ముగురుజ 5-7, 3-6తో పిరంకోవా (బల్గేరియా) చేతిలో పరాజయంపాలైంది. ఇక నాలుగో సీడ్‌ నవోమి ఒసాకా (జపాన్‌) మూడో రౌండ్లో అడుగుపెట్టింది. ఆమె 6-1, 6-2తో జియోర్గి (ఇటలీ)ని వరుస సెట్లలో చిత్తుచేసింది. ఇతర మ్యాచ్‌లో 18వ సీడ్‌ వెకిచ్‌ (క్రొయేషియా) 6-2, 6-1తో ప్యాట్రిక మరియాపై విజయం సాధించింది. జబెర్‌, సకారి మూడో రౌండ్లో ప్రవేశించారు.

పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ నోవాక్ జకోవిచ్‌ (సెర్బియా) కాస్త శ్రమించినా తేలిగ్గానే ముందంజ వేశాడు. రెండో రౌండ్లో అతను 6-7 (5/7), 6-3, 6-4, 6-2తో ఎడ్మండ్‌ (యూకే)పై విజయం సాధించాడు అన్‌సీడెడ్‌ ఎడ్మండ్‌ నుంచి తొలి సెట్లో జకోవిచ్‌కు గట్టిపోటీ ఎదురైంది. ఇద్దరు హోరాహోరీగా తలపడడంతో ఆ సెట్‌ టైబ్రేకర్‌కు దారితీసింది. టైబ్రేకర్‌లో ఎడ్మండ్‌ 7-5తో సెట్‌ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత పుంజుకున్న జకోవిచ్‌.. వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

మిగతా మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ (బ్రిటన్‌) 7-6 (7-2), 6-3, 6-4తో క్రెస్సీ (యుఎస్‌ఏ)పై, అయిదో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) 7-5, 6-7 (8/10), 6-3, 6-1తో నకషిమ (యుఎస్‌ఏ)పై, ఏడో సీడ్‌ గొఫిన్‌ (బెల్జియం) 7-6 (8/6), 4-6, 6-1, 6-4తో హారిస్‌ (దక్షిణాఫ్రికా)పై విజయాలు అందుకున్నారు. షపోవలోవ్‌ (కెనడా), కొరిచ్‌ (క్రొయేషియా) కూడా ముందంజ వేశారు.

IPL 2020: చెన్నైకి షాక్.. ఐపీఎల్ 2020 టైటిల్ ఫేవరెట్ లిస్టులో ఆ మూడు జట్లు!!IPL 2020: చెన్నైకి షాక్.. ఐపీఎల్ 2020 టైటిల్ ఫేవరెట్ లిస్టులో ఆ మూడు జట్లు!!

Story first published: Friday, September 4, 2020, 7:45 [IST]
Other articles published on Sep 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X