న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. టాప్ సీడ్ల పోరు ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. బెలిండా బెన్‌కిక్ (స్విట్జర్లాండ్) చేతిలో మహిళల సింగిల్స్ టాప్ సీడ్ నవోమీ ఒసాకా (జపాన్) పరాజయం పాలవ్వగా.. గాయం కారణంగా వావ్రింకా (స్విట్జర్లాండ్)తో జరుగుతున్న మ్యాచ్ మధ్యలోనే నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) వైదొలిగి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించిన స్పెయిన్ వీరుడు రఫెల్ నాదల్ క్వార్టర్స్‌కు చేరాడు. క్వార్టర్స్‌లో విజయం సాధించిన ఐదో సీడ్ ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్) సెమీస్‌కు దూసుకెళ్లింది.
స్టేడియంలో రోహిత్ సందడి.. జమైకా ప్రేక్షకులతో డాన్స్ (వీడియో)
13వ సీడ్ బెలిండా బెన్సిక్ 7-5, 6-4తో వరుస సెట్లలో ఒసాకాను కంగుతినిపించింది. దీంతో యూఎస్ ఓపెన్‌లో రెండోసారి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. బెలిండా సెమీస్ బెర్త్ కోసం క్రొయేషియా క్రీడాకారిణి డొన్నా వెకిక్తో తలపడనుంది. తాజా ఓటమితో ఒసాకా.. నెంబర్‌వన్ ర్యాంకును కోల్పోనుంది. ప్రస్తుతం రెండో ర్యాంకులోనున్న ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) టాప్ ర్యాంక్ దక్కించుకోనుంది. క్వార్టర్స్‌లో 5వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6-4, 6-4తో జొహన్నా కాంటా (బ్రిటన్)ను ఓడించి.. ప్రస్తుత టోర్నీలో మహిళల సింగిల్స్‌లో సెమీస్ చేరిన తొలి ప్లేయర్‌గా నిలిచింది.
మరో మ్యాచ్‌లో 15వ సీడ్ ఆండ్రెస్క్యూ (కెనడా) 6-1, 4-6, 6-2 తేడాతో టౌన్సెండ్ (అమెరికా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. 23వ సీడ్ వెకిక్ 6-7(5/7), 7-5, 6-3తో జూలియా జార్జెస్ (జర్మనీ)పై గెలిచి క్వార్టర్స్ చేరింది. ఎలిసె మెర్టెన్స్ (బెల్జియం) 6-1, 6-1తో స్థానిక ప్లేయర్ క్రిస్టీ అన్పై విజయం సాధించారు. అమెరికా తార సెరీనా విల్లియమ్స్ సెమీస్ చేరింది. సెరెనా 6-3,6-4తో మార్టిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించింది.
పురుషుల మాజీ చాంపియన్ రఫెల్ నాదల్ 6-3, 3-6, 6-1, 6-2తో 2014 విజేత సిలిచ్ (క్రొయేషియా)ను ఓడించి క్వార్టర్స్‌లో డీగో ష్వార్జ్‌మన్ (అర్జెంటీనా)తో క్వార్టర్స్ ఫైట్‌కు సిద్ధమయ్యాడు. డీగో 3-6, 6-2, 6-4, 6-3తో 6వ సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)నిఓడించాడు. వావ్రింకాతో ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ గాయంతో మధ్యలోనే తప్పుకొన్నాడు. 6-4, 7-5, 2-1తో వావ్రింకా ఆధిక్యంలో ఉన్న దశలో జొకో వైదొలిగాడు. దీంతో వావ్రింకా క్వార్టర్స్ చేరాడు. మాథ్యూ బెర్రెటిని 6-1, 6-4, 7-6(8-6)తో ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)పై.. మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 6-1, 6-2, 6-2తో ఆండుజర్ (స్పెయిన్)పై గెలిచి క్వార్టర్స్ ఫైట్‌కు సిద్ధమయ్యారు.